Censorship: 5 నెలల్లో మోదీ ప్రభుత్వం 130 సెన్సార్‌షిప్ ఆదేశాలు జారీ..పౌరుల స్వేచ్ఛను కాపాడేందుకేనా..
ABN , Publish Date - Apr 22 , 2025 | 09:55 AM
భారతదేశంలో బావ ప్రకటనా స్వేచ్ఛ క్రమంగా దెబ్బతింటుందని పలువురు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే ఇటీవలి కాలంలో ప్రభుత్వం జారీ చేసిన సెన్సార్‌షిప్ ఉత్తర్వుల సంఖ్య పెరగడం ప్రస్తుతం ఈ ప్రశ్నలు వేసేలా చేస్తోంది. అసలు ఏం జరిగిందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
మోదీ ప్రభుత్వం బావ ప్రకటనా స్వేచ్ఛను అణచివేస్తుందని కొంత మంది ఆరోపిస్తున్నారు. అందుకు గల కారణం హోం మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న సహయోగ్ పోర్టల్ ద్వారా గత 5 నెలల్లో 130 సెన్సార్‌షిప్ ఉత్తర్వులు జారీ చేయడమేనని చెబుతున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) చట్టం, 2000లోని సెక్షన్ 79(3)(బి) కింద ఈ ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. ఇది కంటెంట్‌ను తొలగించడానికి లేదా యాక్సెస్‌ను నిరోధించడానికి వీలు కల్పిస్తుంది. సహయోగ్ పోర్టల్‌ను 2024లో హోం మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. అభ్యంతరకరమైన ఆన్‌లైన్ కంటెంట్‌ను వెంటనే తొలగించడం, నిరోధించడమే దీని లక్ష్యం.
ఇప్పటివరకు..
ఈ పోర్టల్‌ను ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) నిర్వహిస్తుంది. సైబర్ స్పేస్‌ను సురక్షితంగా ఉంచడానికి సమన్వయంతో కూడిన చర్యలను తీసుకునేందుకు దీనిని ప్రారంభించారు. ఈ క్రమంలో వివిధ ప్రభుత్వ సంస్థలు, ఐటి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను ఒకే వేదికపైకి తీసుకొస్తారు. ఇప్పటివరకు ఇందులో గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, టెలిగ్రామ్, ఆపిల్, షేర్‌చాట్, స్నాప్‌చాట్, లింక్డ్ఇన్, యూట్యూబ్ వంటివి కూడా దీని పరిధిలో ఉన్నాయి.
గ్రూపులను బ్లాక్ చేయగలదు
ఈ పోర్టల్లో 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ అధికారులను నమోదు చేసుకున్నాయి. ఈ పోర్టల్ ద్వారా గూగుల్ తన ప్లే స్టోర్ యాప్, యూట్యూబ్ వీడియోలు, డ్రైవ్ లింక్‌లను బ్లాక్ చేయగలదు. దీంతోపాటు వాట్సాప్ నంబర్‌లు, ఛానెల్‌లు లేదా గ్రూపులను బ్లాక్ చేయగలదని ఓ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అదేవిధంగా, Facebook, Instagram కంటెంట్, ప్రొఫైల్‌లు, ప్రకటనల పోస్ట్‌లను కూడా తీసే అధికారం ఉంటుంది.
సెన్సార్‌షిప్ విధానం
ఈ పోర్టల్ విషయంలో ప్రస్తుతం వివాదం నెలకొంది. ఎలాన్ మస్క్ యాజమాన్యంలోని సోషల్ మీడియా కంపెనీ X కర్ణాటక హైకోర్టులో సెన్సార్‌షిప్ పోర్టల్ అని పేర్కొంటూ దావా వేసింది. సెక్షన్ 79(3)(b)ని ఉపయోగించడం ద్వారా, ప్రభుత్వం చట్టవిరుద్ధమైన సెన్సార్‌షిప్ విధానాన్ని పాటిస్తుందని తెలిపింది. ఇది ఐటీ చట్టంలోని సెక్షన్ 69A కింద సూచించబడిన విధానపరమైన రక్షణలను పాటించడం లేదని X వాదిస్తోంది. సెక్షన్ 69A జాతీయ భద్రత, ప్రజా సంక్షేమం వంటి కారణాలపై కంటెంట్‌ను నిరోధించడానికి, స్వతంత్ర సమీక్ష వంటి విధానాలకు అనుమతిస్తుంది.
ఏ కంటెంట్‌ను కూడా..
కర్ణాటక హైకోర్టులో దాఖలు చేసిన విషయంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. X వాదనను దురదృష్టకరం, ఖండించదగినదని పేర్కొంది. చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను తొలగించే ప్రక్రియను వేగవంతం చేయడానికి సహయోగ్ పోర్టల్ ఒక సులభతరం చేసే యంత్రాంగం అని వెల్లడించింది. తగిన ప్రక్రియ లేకుండా ఏ కంటెంట్‌ను బ్లాక్ చేయలేమని ప్రభుత్వం చెబుతోంది. అయినప్పటికీ, ఈ పోర్టల్ ప్రస్తుతం పారదర్శకత పాటించడం లేదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
TRAI: సిగ్నల్, నెట్ లేకపోతే సైలెంట్ కాదు..ఫిర్యాదు చేయడం మరింత ఈజీ తెలుసా..
Google CCI: గూగుల్ కీలక నిర్ణయం..ఆ కేసు పరిష్కారం కోసం రూ.20.24 కోట్లు చెల్లింపు
Scam Payments: మార్కెట్లోకి నకిలీ ఫోన్ పే, గూగుల్ పే యాప్స్.. జర జాగ్రత్త..
Viral News: 70 ఇన్ స్పేస్..అంతరిక్షంలో రోదసీ యాత్రికుడి బర్త్ డే సెలబ్రేషన్
Bill Gates: వారానికి మూడు రోజేలే పని..బిల్ గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Read More Business News and Latest Telugu News