Manjinder Singh Sirsa: ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు చర్యలు వేగవంతం చేస్తాం
ABN , Publish Date - Nov 19 , 2025 | 12:18 PM
ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు చర్యలు వేగవంతం చేస్తామని మంత్రి, మంజిందర్ సింగ్ సిర్సా పేర్కొన్నారు. కాలుష్య నియంత్రణలో ప్రజలు తమతో కలిసి రావాలని పిలుపునిచ్చారు.
ఢిల్లీ, నవంబరు18(ఆంధ్రజ్యోతి): ఢిల్లీలో నెలకొన్న కాలుష్యం (Delhi Pollution)పై ఆ రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా (Minister Manjinder Singh Sirsa) స్పందించారు. ఢిల్లీ కాలుష్యంపై తమ ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. రోడ్లపై పేరుకుపోయే దుమ్ము, వాహనాల కాలుష్యాన్ని పరిష్కరించడానికి త్వరితగతిన చర్యలు చేపట్టామని వివరించారు. ఇందులో భాగంగా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో హాట్‌స్పాట్‌లను గుర్తించామని చెప్పుకొచ్చారు. ఇవాళ(బుధవారం) ఢిల్లీ వేదికగా మీడియాతో మాట్లాడారు మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా.
ఢిల్లీలో దాదాపు 62 హాట్‌స్పాట్‌లను గుర్తించామని పేర్కొన్నారు. వాటిని ఆపగలిగితే, కాలుష్యం మరింత తగ్గుతుందని వివరించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. అందరం కలిసి కాలుష్యంపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఇది ఢిల్లీ ప్రభుత్వం కాలుష్యంపై చేస్తున్న యుద్ధమని చెప్పుకొచ్చారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలిని అందించడానికి.. ఈ యుద్ధంలో పోరాడటానికి ప్రజలు తమతో కలిసి రావాలని కోరారు. కాలుష్య కారకాలపై తమ ప్రభుత్వం అన్వేషణ చేస్తోందని మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
మోదీ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉంది.. మళ్లీ శిశథరూర్ ప్రశంసలు
ఓటమికి బాధ్యత నాదే, పొరపాట్లు సరిచేసుకుంటాం
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.