30 నుండి 40 లక్షలకే మిగ్ 21 యుద్ధ విమానాలు
ABN , Publish Date - Sep 15 , 2025 | 06:22 AM
భారత వాయుసేన అమ్ముల పొదిలో ఇప్పటి వరకు కీలకంగా ఉన్న మిగ్-21 యుద్ధ విమానాలు 30-40 లక్షలకే అమ్మకానికి సిద్ధం కానున్నాయి. వీటిని కొనేందుకు పలు సంస్థలు...
బారులు తీరుతున్న పలు సంస్థలు
న్యూఢిల్లీ, సెప్టెంబరు 14 : భారత వాయుసేన అమ్ముల పొదిలో ఇప్పటి వరకు కీలకంగా ఉన్న మిగ్-21 యుద్ధ విమానాలు 30-40 లక్షలకే అమ్మకానికి సిద్ధం కానున్నాయి. వీటిని కొనేందుకు పలు సంస్థలు బారులు తీరుతున్నాయి. ఇప్పటికే పలు ప్రభుత్వ సంస్థలు, విద్యా సంస్థలు, పబ్లిక్, ప్రైవేటు సంస్థలు వీటి కోసం దరఖాస్తు చేసుకోవడంతో చాంతాడంత జాబితా తయారైనట్లు వాయుసేన వర్గాల సమాచారం. అయితే వీటిని విక్రయించేటప్పుడు వాటిలోని ఇంజన్, ఇతర వ్యవస్థలను తొలగించి ఎయిర్‌ఫ్రేమ్‌ను మాత్రమే అప్పగిస్తారు. వాయుసేనలో 1963లో ప్రవేశపెట్టిన ఈ యుద్ధ విమానాలు పలు యుద్ధాల్లో కీలక పాత్ర వహించాయి. ఈ నెల 26న చండీగఢ్‌లో మిగ్-21ల తుది స్క్వాడ్రన్‌కు వీడ్కోలు పలకనున్నారు.
ఇవి కూడా చదవండి..
అస్సాంలో 5.8 తీవ్రతతో భూకంపం.. బెంగాల్‌లోనూ ప్రకంపనలు
నేను శివ భక్తుడిని, నేను విషం అంతా మింగేస్తాను
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి