Meghalaya Honeymoon Case: సోనమ్ బ్యాగ్‌లో మంగళసూత్రాలు.. రెండు పెళ్లిళ్లు చేసుకుందా..
ABN , Publish Date - Jul 04 , 2025 | 10:01 AM
మేఘాలయ హనీమూన్ మర్డర్ ఎపిసోడ్‌లో రోజుకో ట్విస్ట్ బయటపడుతోంది. తాజాగా, సోనమ్ రఘువంశీ బ్యాగ్‌లో రెండు మంగళసూత్రాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే, ఈ విషయంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజా కంటే ముందే ఆమె రాజ్‌ను వివాహం చేసుకుందా?
Meghalaya Honeymoon Case Update: ఇండోర్ వ్యాపారవేత్త రాజా రఘువంశీ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పెళ్లి జరిగిన కొన్ని రోజులకే తన భార్య సోనమ్ రఘువంశీ అతడిని అతి దారుణంగా హత్య చేయించింది. ఈ కేసుకు సంబంధించి రోజుకో ట్విస్ట్‌లు బయటపడుతున్నాయి. అయితే, తాజాగా నిందితురాలైన భార్య సోనమ్ రఘువంశీకి సంబంధించి పోలీసులు ఒక ముఖ్యమైన ఆధారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
సోనమ్ బ్యాగులో రెండు మంగళసూత్రాలను పోలీసులు గుర్తించారు. పెళ్లి సమయంలో భర్త రాజా కుటుంబం ఒక మంగళసూత్రాన్ని బహుమతిగా ఇవ్వగా మరొక మంగళసూత్రం గురించి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సోనమ్‌కు ఈ రెండవ మంగళసూత్రాన్ని ఎవరు ఇచ్చారు? రాజ్ ఇచ్చాడా? సోనమ్‌కు ఇంతకు ముందే పెళ్లి అయిందా? లేదా షిల్లాంగ్ నుండి తిరిగి వచ్చిన తర్వాత రాజ్‌ను వివాహం చేసుకుందా? లేదా రెండో పెళ్లి చేసుకోవాలని ముందుగానే ప్లాన్‌తో మంగళసూత్రం కొనుక్కుందా? ఇలా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇదిలా ఉంటే.. రాజా రఘువంశీ అన్నయ్యలు విపిన్, సచిన్.. మరోసారి నిందితులకు నార్కో పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. విపిన్ రఘువంశీ మాట్లాడుతూ.. సోనమ్‌కు తాము 17-18 లక్షల విలువైన నగలు ఇచ్చామని, వాటితో ఆమె బహుశా హనీమూన్‌కు వెళ్లి ఉండవచ్చని అంటున్నారు. ఈ హత్యలో పాల్గొన్న వారందరికీ కఠినమైన శిక్ష విధించాలని రాజా రఘువంశీ అన్నయ్యలు డిమాండ్ చేస్తున్నారు.
Also Read:
హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్.. దీపిక కంటే ముందు ఆ భారతీయ నటుడు
నిర్లక్ష్యం ఇలాక్కూడా ఉంటుందా.. ఈ ఫ్రిడ్జ్ లోపల ఏముందో చూస్తే నోరెళ్లబెడతారు..
For More National News