Delhi Kolkata highway jam: నాలుగు రోజులుగా రోడ్ల మీదే.. ఢిల్లీ కోల్‌కతా హైవేపై భారీ ట్రాఫిక్ జామ్..
ABN , Publish Date - Oct 08 , 2025 | 07:19 AM
దసరా సమయం కావడంతో దేశంలోని చాలా ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి. ఆది, సోమవారాల్లో విజయవాడ-హైదరాబాద్ హైవే మీద ఏర్పడిన ట్రాఫిక్ జామ్ ప్రయాణికులకు నరకం చూపించింది. అంతకు మించి కోల్‌కతా-ఢిల్లీ హైవే చుక్కలు చూపిస్తోంది.
దసరా సమయం కావడంతో దేశంలోని చాలా ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి. ఆది, సోమవారాల్లో విజయవాడ-హైదరాబాద్ హైవే మీద ఏర్పడిన ట్రాఫిక్ జామ్ ప్రయాణికులకు నరకం చూపించింది. అంతకు మించి కోల్‌కతా-ఢిల్లీ హైవే చుక్కలు చూపిస్తోంది. బీహార్‌లోని కోల్‌కతా-ఢిల్లీ హైవే మీద నాలుగు రోజులుగా వాహనాలు ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్నాయి. వందలాది వాహనాలు దాదాపుగా బంపర్-టు-బంపర్ క్యూలో నిలిచి ఉండిపోయాయి (Delhi Kolkata traffic update).
గత శుక్రవారం బీహార్‌లోని రోహ్తాస్ జిల్లాలో కుండపోత వర్షాలు కురిశాయి. దీంతో జాతీయ రహదారి 19లో చాలా భాగం రోడ్లు ధ్వంసమయ్యాయి. దీంతో ఆ హైవేపై పలు చోట్ల వివిధ ప్రదేశాలలో నిర్మించిన మళ్లింపులు, సర్వీస్ లేన్‌లు పూర్తిగా నీటితో నిండిపోయాయి. ఈ రోడ్లపై ప్రతిచోటా గుంతలు దర్శనమిచ్చాయి. చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కొన్ని కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి కూడా గంటలు పడుతోంది. ఈ ట్రాఫిక్ జామ్ ఇప్పుడు రోహ్తాస్ నుంచి దాదాపు 65 కి.మీ దూరంలో ఉన్న ఔరంగాబాద్ వరకు విస్తరించింది (highway traffic jam).
ఈ రహదారిలో ప్రయాణిస్తున్న వారు ఒక రోజుకు కేవలం ఐదు కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించగలుగుతున్నారు (4 day traffic jam). రెండు రోజులుగా తాము ట్రాఫిక్ జామ్‌లలో చిక్కుకున్నామని, ఆకలితో, దాహంతో దయనీయ స్థితిలో ఉన్నామని, కొన్ని కిలోమీటర్లు ప్రయాణించడానికి కూడా గంటలు పడుతోందని ఓ ట్రాక్ డ్రైవర్ తెలిపారు. ఈ భారీ ట్రాఫిక్ జామ్‌ను తొలగించడానికి స్థానిక పరిపాలనా విభాగం ఎటువంటి ప్రయత్నమూ చేయడం లేదని, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI), రోడ్డు నిర్మాణ సంస్థ ఈ విషయంలో ఎటువంటి చర్య తీసుకోలేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి:
లాభాల నుంచి నష్టాల్లోకి.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి