Share News

Karnataka: పట్టపగలే దారుణం.. ఏటీఎంలో డబ్బులు జమ చేస్తుండగా

ABN , Publish Date - Jan 16 , 2025 | 03:07 PM

Karnataka: బీదర్ కోర్టు సమీపంలోని శివాజీ నగర్ ప్రాంతంలో గల ఓ ఏటీఎంలో నగదు జమ చేస్తుండగా దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. ఏటీఎంలో దాదాపు రూ.93 లక్షల నగదును ఫిల్ చేసేందుకు సెక్యూరిటీ సిబ్బంది వాహనంతో వెళ్లారు. ఇదే సమయంలో బైక్‌పై ముసుగు ధరించి వచ్చిన ఇద్దరు దుండగులు ఏటీఎంలోకి చొరబడి డబ్బును లాక్కెళ్లడానికి ప్రయత్నించారు.

Karnataka: పట్టపగలే దారుణం.. ఏటీఎంలో డబ్బులు జమ చేస్తుండగా
Massive robbery in bider

కర్ణాటక (బీదర్), జనవరి 16: ఏటీఎంలలో డబ్బులు దొంగతనం చేసేవారిని చూశాం. ఏటీఎంలలో డబ్బులు రాకపోతే వాటిని ఎత్తుకుని వెళ్లిన వాళ్లను చూశాం. కానీ ఈ దొంగల రూట్ సపరేట్ అని చెప్పుకోవాలి. డబ్బులు దొంగతనం చేసేందుకు భారీగా స్కెచ్ వేశారు. ఇందుకు ఏటీఎంలలో నగదును జమ చేసే వాహనాలను టార్గెట్‌ పెట్టుకున్నారు. వాళ్లు అనుకున్న విధంగానే ఓ బ్యాంకు సిబ్బంది ఏటీఎంలో నగదు జమ చేసేందుకు వచ్చిన సమయంలో... అక్కడ వాళ్లు సృష్టించిన భీభత్సం మాత్రం అంతా ఇంతా కాదు. ఎలాగైన దొంగతనం చేయాలనే ఉద్దేశంతో అక్కడి సెక్యూరిటీ సిబ్బందిపై తెగబడ్డారు దొంగలు. దొంగల బీభత్సంతో చుట్టుపక్కల ప్రజలకు భయభ్రాంతులకు గురయ్యారు. ఇంతకీ దొంగలు ఏం చేశారు. వారు ఎలా నగదును దోచుకెళ్లారు... భారీ దోపిడీ ఎక్కడ జరిగిందో ఇప్పుడు చూద్దాం.


కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ పట్టణంలో పట్టపగలు దుంగులు భారీ దోపిడీకి పాల్పడ్డారు. బీదర్ కోర్టు సమీపంలోని శివాజీ నగర్ ప్రాంతంలో గల ఓ ఏటీఎంలో నగదు జమ చేస్తుండగా దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. ఏటీఎంలో దాదాపు రూ.93 లక్షల నగదును ఫిల్ చేసేందుకు సెక్యూరిటీ సిబ్బంది వాహనంతో వెళ్లారు. ఇదే సమయంలో బైక్‌పై ముసుగు ధరించి వచ్చిన ఇద్దరు దుండగులు ఏటీఎంలోకి చొరబడి డబ్బును లాక్కెళ్లడానికి ప్రయత్నించారు. డబ్బులు వదలాలంటూ సెక్యూరిటీ సిబ్బందికి గన్ చూపించారు. అయితే దుండగులకు డబ్బులు ఇచ్చేందుకు సెక్యూరిటీ సిబ్బంది ససేమిరా అన్నారు.

సైఫ్ అలీఖాన్‌పై దాడిలో సంచలన విషయాలు..


దుండగులను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఒక్కసారిగా వారితో తెచ్చుకున్న గన్‌తో సెక్యూరిటీ సిబ్బందిపై కాల్పులు జరిపారు. మొత్తం ఐదు రౌండ్లు కాల్పులు జరిపారు. ఒక సెక్యూరిటీ సిబ్బంది.. ఇద్దరు బ్యాంకు సిబ్బందిపై కాల్పులు జరిపారు దుండగులు. ఈ ఘటనలో ఏటీఎంలో డబ్బు డిపాజిట్ చేసే ఏజెన్సీ ఉద్యోగి గిరి వెంకటేష్ ఉద్యోగి అక్కడిక్కడే మృతి చెందగా.. గాయపడిన శివకుమార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మరొకరు బుల్లెట్ గాయాలతో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. దుండగుల బీభత్సంపై కేసు నమోదు చేసిన పోలీసులు..వారి కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.

విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్నారా.. బిగ్ అలర్ట్


కాగా.. ఏటీఎంలో నగదును జమ చేసేందుకు వెళ్లిన సెక్యూటిరీ సిబ్బందిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి నగదును చోరీ చేయడం కర్ణాటకలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన జరిగిన వెంటనే అక్కడ ఆధారాలను సేకరించిన పోలీసులు.. వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై స్పందించిన కర్ణాటక డీజీపీతో దుండగును పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.


ఇవి కూడా చదవండి...

తగ్గని మంటలు.. చంద్రగిరి పీఎస్‌కు మనోజ్

కారు సిద్ధంగా లేక.. ఆటోలో ఆస్పత్రికి వెళ్లిన సైఫ్..

Read Latest National News And Telugu News

Updated Date - Jan 16 , 2025 | 03:10 PM