Share News

Destroyed In Seconds:సెకన్లలో పెను విధ్వంసం.. సంచలన విజువల్స్..

ABN , Publish Date - Aug 05 , 2025 | 07:20 PM

ప్రకృతి ప్రకోపిస్తే ఎలా ఉంటుందనేందుకు ఉత్తరాఖండ్‌లో మంగళవారం చోటు చేసుకున్న జల విస్పోట ఘటనలే ప్రత్యక్ష ఉదాహరణ. అందుకు సంబంధించిన విజువల్స్ ఒళ్లు గగ్గురు పొడుస్తున్నాయి.

Destroyed In Seconds:సెకన్లలో పెను విధ్వంసం.. సంచలన విజువల్స్..

డెహ్రాడూన్, ఆగస్ట్ 05: ప్రకృతి ప్రకోపిస్తే ఎలా ఉంటుందనేందుకు ఉత్తరాఖండ్‌లో మంగళవారం చోటు చేసుకున్న జల విస్పోట ఘటనలే ప్రత్యక్ష ఉదాహరణ. అంతా రెప్ప పాటులోనే కొన్ని సెకన్ల తేడాతో ఈ జల విస్పోటం చోటు చేసుకుంది. దీని కారణంగా భారీ వర్షాల రూపంలో జల ప్రళయం ఉవ్వెత్తిన ఎగసిపడి ఉత్తర కాశీ జిల్లాలోని పలు గ్రామాలను ముంచెత్తింది. దీంతో ధరలి గ్రామంలోని నివాసాలకు నివాసాలు కొట్టుకుపోయాయి.

Rains-03.jpg


ఈ ఘటనలో నలుగురు మరణించారు. 50 మందికిపైగా గల్లంతయ్యారు. ఈ సంఘటన చోటు చేసుకున్న కొన్ని సెకన్లకే ధరాలీ సమీపంలోని సుఖీ గ్రామంలో సైతం జల విస్పోటనం సంభవించింది. దీంతో ఈ ప్రాంతంలో మరణించిన వారి సంఖ్య 10కి చేరింది. ఈ గ్రామంలో సైతం నివాసాలు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాయి.

jajapralayam.jpg


ఈ వరద నీటి ప్రవాహానికి బయపడి.. ప్రజలు ఇళ్లు వదిలి బయటకు పరుగులు తీశారు. మరోవైపు ఆ యా గ్రామాలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీస్ బృందాలు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. అందుకు సంబంధించిన సహాయక చర్యలు కొనసాగుతోన్నాయి.

Heavy-Rains-04.jpg


ఇక ఈ ప్రళయంపై సీఎం పుష్కర్ సింగ్ ధామీకి ప్రధాని మోదీ, హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ఫోన్ చేసి.. వివరాలు అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యల కోసం కేంద్ర భద్రతా బృందాలను ఉత్తరాఖండ్‌కు పంపిస్తామని సీఎంకు కేంద్ర మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. ఇక ఉత్తర కాశీ జిల్లాలోని ఖీర్ గథ్ నదీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. అదీకాక కొండ చరియలు సైతం విరిగి పడడంతో వాటి కింద పదుల సంఖ్యలో ప్రజలు ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

Rains-02.jpg


అలాగే ఈ జల ప్రళయానికి 20 నుంచి 25 హోటళ్లు కొట్టుకు పోయానని వారు వివరించారు. మరోవైపు ఘటన స్థలానికి జిల్లా కలెక్టర్‌తోపాటు ఎస్పీ బయలుదేరి వెళ్లినట్లు ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి సుధాంశ్ వెల్లడించారు. జరిగిన నష్టాన్ని వారు అంచనా వేస్తారన్నారు.

CloudBurost02.jpg


ఇప్పటికే పలు బృందాలు ఆ యా గ్రామాలకు చేరుకుని సహాయక చర్యల చేస్తున్నాయని చెప్పారు. ఇంకోవైపు ఉత్తరాఖండ్‌లోని పలు ప్రాంతాల్లో మంగళవారం భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావారణ కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అందులోభాగంగా అన్ని జిల్లాలో యంత్రాగాన్ని అప్రమత్తం చేసింది.


ఈ వార్తులు కూడా చదవండి..

ఎన్నికల్లో మళ్లీ బ్యాలెట్ విధానాన్ని ప్రవేశపెట్టాలి: కేటీఆర్

బీజేపీ అగ్రనేత ఎల్.కె. అద్వానీ రికార్డు బద్ధలు కొట్టిన అమిత్ షా

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 05 , 2025 | 08:35 PM