Maratha Reservation: మరాఠా ఉద్యమకారుడు జరాంగే దీక్ష విరమణ
ABN , Publish Date - Sep 03 , 2025 | 03:26 AM
మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్‌తో అయిదు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న మనోజ్ జరాంగే..
హైదరాబాద్ గెజిట్ ప్రకారం కున్బీలకు కుల సర్టిఫికెట్లు
తద్వారా బీసీ రిజర్వేషన్లు.. మహారాష్ట్ర సర్కారు అంగీకారం
ముంబై, సెప్టెంబరు 2: మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్‌తో అయిదు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న మనోజ్ జరాంగే (43) మంగళవారం తన ఆందోళనను విరమించారు. ఆయన దీక్ష చేస్తున్న ఆజాద్ మైదాన్‌కు రాష్ట్ర మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు రాధాకృష్ణ వీఖే పాటిల్ వెళ్లి పళ్ల రసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. హైదరాబాద్ గెజిట్ ఆధారంగా కున్బీ కులస్థులను గుర్తించి, వారికి ఓబీసీ సర్టిఫికెట్లు ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించడంతో జరాంగే శాంతించారు. ఈ మేరకు ప్రభుత్వం గవర్నమెంట్ రిజల్యూషన్ (జీఆర్)ను జారీ చేసింది కూడా. మరఠ్వాడా ప్రాంతం నిజాం పాలనలో ఉన్నప్పుడు మరాఠీల్లో ఎవరెవరు కున్బీ కులంలోకి వస్తారన్నదానిపై 1918లో గెజిట్ విడుదల చేసింది. దీన్నే హైదరాబాద్ గెజిట్‌గా పేర్కొంటున్నారు. ఇతర ప్రాంతాల్లోని కున్బీలకు ఓబీసీ గుర్తింపు ఉండడంతో మరఠ్వాడా ప్రాంతంలోని వారికి కూడా హైదరాబాద్ గెజిట్ ఆధారంగా కున్బీ కుల సర్టిఫికెట్ ఇవ్వనున్నారు. దాని ఆధారంగా ఓబీసీ సర్టిఫికెట్ మంజూరు చేస్తారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మణిపూర్‌లో పర్యటించనున్న ప్రధాని మోదీ..!
ఏపీ మహేష్ బ్యాంక్‌కు షాక్ ఇచ్చిన ఈడీ
For More National News And Telugu News