Maoist Lakshmi Surrender: నక్సల్ రహిత రాష్ట్రంగా కర్ణాటక.. లొంగిపోయిన చివరి మావోయిస్ట్
ABN , Publish Date - Feb 02 , 2025 | 08:58 PM
పోలీసుల కథనం ప్రకారం, కొద్దికాలంగా ఆంధ్రప్రదేశ్‌లో తలదాచుకుంటున్న లక్ష్మి ఉడిపి జిల్లాలో మూడు కేసులను ఎదుర్కొంటున్నారు. ఇవన్నీ 2007-2008కి చెందినవి. పోలీసులపై కాల్పులు, దాడి, మావోయిస్టు సాహిత్యాన్ని గ్రామాలు, చిన్న పట్టణాల్లో పంచారన్న కేసులు ఆమెపై ఉన్నాయి.
ఉడిపి: మావోయిస్టు లక్ష్మి (Maoist Lakshmi) ఆదివారంనాడు ఉడుపి డిప్యూటీ కమిషనర్ విద్యా కుమారి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆరుణ్ కె సమక్షంలో బేషరుతుగా లొంగిపోయారు. కర్ణాటకలో చివరి మావోయిస్టుగా లక్ష్మిని భావిస్తున్నారు. ఆమె లొంగిపోవడంతో కర్ణాటక (Karnataka) మావోయిస్టు రహిత రాష్ట్రంగా మారినట్టు అధికారులు తెలిపారు.
Siddaramaiah: సీఎంకు అస్వస్థత.. అధికారిక కార్యక్రమాలు రద్దు
పోలీసుల కథనం ప్రకారం, కొద్దికాలంగా ఆంధ్రప్రదేశ్‌లో తలదాచుకుంటున్న లక్ష్మి ఉడిపి జిల్లాలో మూడు కేసులను ఎదుర్కొంటున్నారు. ఇవన్నీ 2007-2008కి చెందినవి. పోలీసులపై కాల్పులు, దాడి, మావోయిస్టు సాహిత్యాన్ని గ్రామాలు, చిన్న పట్టణాల్లో పంచారన్న కేసులు ఆమెపై ఉన్నాయి. కుందపుర తాలూకా మచ్చట్టు గ్రామానికి చెందిన లక్ష్మి 15 ఏళ్ల క్రితం కుటుంబాన్ని విడిచిపెట్టి అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. చిక్కమగళూరు, ఉడిపి జిల్లాల్లో నక్సల్ ఐడియాలజీని వ్యాప్తిచేయడంలో ఆమె చురుకుగా వ్యవహరిస్తూ వచ్చినట్టు పోలీసులు చెబుతున్నారు. ఇటీవల లొంగిపోవాలని నిర్ణయించుకున్న లక్ష్మి గతంలో లొంగిపోయిన తన భర్త సలీంతో కలిసి ఆదివారంనాడు ఉడుపి పోలీసుల ముందు సరెండర్ అయ్యారు.
కర్ణాటక ప్రభుత్వం సరెండర్ ప్రోటోకాల్, ప్యాకేజీ ప్రకటించడంతో తాను లొంగిపోయేందుకు జిల్లా అధికారులతో గతంలో సంప్రదించానని, అయితే కొన్ని కారణాల వల్ల అది సాధ్యం కాలేదని లక్ష్మి తెలిపారు. ఇప్పుడు సరెండర్ కమిటీని ఏర్పాటు చేయడంతో లొంగిపోవడానికి మార్గం సుగగమైందని చెప్పారు. సరెండర్ ప్యాకేజీని ప్రకటించి, తనపై ఉన్నమూడు కేసులను ఉపసంహరించుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. కాగా, సరెండర్ ప్యాకేజీలోని 'ఎ' క్యాటగిరి కింద రూ.7 లక్షల ఆర్థిక సాయానికి లక్ష్మి అర్హురాలని డీసీ విద్యాకుమారి తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Sonia Gandhi: సోనియా గాంధీపై కోర్టులో ఫిర్యాదు చేసిన న్యాయవాది.. ఎందుకంటే..
Maha Kumbh Mela 2025: మహా కుంభమేళాకు భక్తజనం.. ఫిబ్రవరి 1 నాటికి ఎంత మంది వచ్చారంటే..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి