Tendonitis: కదులుతున్న రైలులో మహిళకు పురుటినొప్పులు.. యువకుడు ట్రైన్ ఆపి.. డెలివరీ చేసి..
ABN , Publish Date - Oct 17 , 2025 | 08:16 AM
అంతలోపే తీవ్రమైన ప్రసవ వేదన అనుభవిస్తున్న సదరు మహిళ కడుపులోని శిశువు సగం బయటకు రావడం కూడా జరిగిపోయాయి. దీంతో పరిస్థితి అత్యంత కఠినంగా మారింది. ఏం చేయాలో, ఎటు పోవాలో తెలియక కుటుంబ సభ్యులు అయోమయానికి గురయ్యారు.
ఇంటర్నెట్ డెస్క్, అక్టోబర్ 17: మహిళల పురిటినొప్పులు వర్ణనాతీతం. తొమ్మిది నెలలు శిశువులు మోస్తూ చివరి నెల వరకు బాధను దిగమింగుతూ డెలివరీ సమయాల్లో జరిగే ప్రసవ వేదన నరకంగా ఉంటుంది. ఒక్కొక్కసారి పురిటినొప్పులు ఎక్కువై డెలివరీ చేయాల్సి వస్తుంది. ప్రసవం ఎప్పుడు జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ఒక్కోసారి డాక్టర్లు సరైన సమయం చెప్పినా.. అంతకన్నా ముందు, ఆ తరువాత కొద్ది రోజులకు ప్రసవం జరుగవచ్చు. గర్భాన్ని మోస్తూ నవమాసాలు బిడ్డకోసం పడే పాట్లు అన్నీ ఇన్నీ కాదు. తాను మరణించినా కూడా బిడ్డకు జన్మనివ్వాలని ప్రతి తల్లీ కోరుకుంటుంది. తాజాగా మహారాష్ట్రంలో ఓ మహిళకు ఎదురైన ఘటన నిర్గాంతపోయేలా చేస్తుంది.
బాలీవుడ్ హీరో అమిర్ ఖాన్ ‘3 ఇడియట్స్’ మూవీ మీకు తెలిసే ఉంటుంది. ఆ సినిమాలో చివరి సన్నివేశాన్ని తలపించే ఘటన నిజజీవితంలోనూ జరిగింది. మూవీ క్లైమాక్స్‌లో హీరోయిన్ సోదరి ప్రసవానికి హీరో ఆమిర్ ఖాన్ సహాయం చేసి వారి ప్రాణాలు కాపాడుతాడు. రియల్ లైఫ్ లోనూ సేమ్ అలాంటి ఘటనే ఒకటి మహారాష్ట్రలో బుధవారం రోజున జరిగింది. రైల్వే ప్లాట్‌ఫామ్‌పై పురిటినొప్పులు ఎక్కువ కావడంతో ఒక మహిళ డెలివరీకి ఓ యువకుడు సహాయం చేశాడు. కదులుతున్న రైలులో ఒక మహిళకి పురుటి నొప్పులు రావడంతో.. సహాయం కోసం కేకలు వేసింది. అందరూ షాక్‌లో ఉండగా ట్రైన్ లోనే ఉన్న వికాస్ బింద్రే అనే యువకుడు ముందుకొచ్చి ట్రైన్ ఎమర్జెన్సీ చైన్‌ను లాగాడు. రైలును రామ్ మందిర్ స్టేషన్ వద్ద ఆపేసి ప్లాట్‌ఫామ్ మీదకి మహిళని తీసుకొచ్చాడు.
అంతలోపే తీవ్రమైన ప్రసవ వేదన అనుభవిస్తున్న సదరు మహిళ కడుపులోని శిశువు సగం బయటకు రావడం కూడా జరిగిపోయాయి. దీంతో పరిస్థితి అత్యంత కఠినంగా మారింది. ఏం చేయాలో, ఎటు పోవాలో తెలియక కుటుంబ సభ్యులు అయోమయానికి గురయ్యారు. స్టేషన్‌లోని సెక్యూరిటీ సిబ్బంది, ప్రయాణికులు ఏమౌతుందోనని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. రైల్వే స్టేషన్ దగ్గరలో ఆసుపత్రి, అంబులెన్స్ అందుబాటులో కూడా లేవు. ఇక చలించిపోయిన యువకుడు వికాస్ తానే స్వయంగా ముందుకు వచ్చి ఆ మహిళ డెలివరీకి సహాయపడ్డాడు. వైద్యురాలిగా పనిచేస్తున్న తన స్నేహితురాలికి ఫోన్ చేశాడు. వీడియో కాల్ చేసి అక్కడి పరిస్థితిని ఆమెకు చూపించాడు. ఆ తర్వాత వైద్యురాలు సూచనలు పాటిస్తూ సురక్షితంగా డెలివరీ చేయడంలో సాయం అందించాడు. దీంతో తల్లీ బిడ్డ ఇద్దరూ సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. వీరికి అక్కడినుంచి ఆసుపత్రికి తరలించారు. యువకుడు వికాస్ చేసిన సహాయంపై నెట్టింట ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రసవ వేదన నరకంనుంచి విముక్తి తల్లిని విముక్తి కలిగించి ఇద్దరి ప్రాణాలు కాపాడిన తీరును పలువురు అభినందిస్తున్నారు. నేటి యువతకు వికాస్ స్ఫూర్తిదాయకం అని కొనియాడుతున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను మ్యూజిక్ డైరక్టర్ మంజీత్ ధిల్లోన్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. ట్రైన్ నుంచి బయటకు వచ్చినప్పుడు బిడ్డ తల భాగం బయటకు వచ్చేసి, మిగిలిన శరీరం లోపల ఉండడంతో ప్రాణాపాయ పరిస్థితి నెలకొందని, ఆ సమయంలో దేవుడే తన దూతగా ఆ యువకుడిని అక్కడికి పంపించినట్టుగా అనిపించిందని ధిల్లోన్ పేర్కొన్నారు. ఆ యువకుడి పేరు వికాస్ అని చెప్పారు. తన స్నేహితురాలు డాక్టర్ దేవికా దేశ్‌ముఖ్‌కు వీడియో కాల్ చేసి, ఆమె చెప్పిన సూచనలతో జాగ్రత్తగా బిడ్డను ప్రసవింపజేశాడని వివరించారు.
ఇవి కూడా చదవండి:
Bengaluru Doctor: మత్తు ఇచ్చి భార్యను చంపిన వైద్యుడు
Supreme Court: హైకోర్టులోనే తేల్చుకోండి