Share News

Mamata Kulakarni: మమతా కులకర్ణి రాజీనామా తిరస్కరణ

ABN , Publish Date - Feb 14 , 2025 | 03:56 PM

తొలుత భావోద్వేగంతో తన హోదాకు రాజీనామా చేశానని, అయితే ఆ తర్వాత గురువుల మార్గదర్శకంలో సనాతన ధర్మానికి సేవలు కొనసాగించేందుకు నిశ్చయించుకున్నానని మమత కులకర్ణి చెప్పారు.

Mamata Kulakarni: మమతా కులకర్ణి రాజీనామా తిరస్కరణ

ప్రయాగ్‌రాజ్: కిన్నార్ అఖాడా మహామండలేశ్వర్ పదవికి బాలీవుడ్ నటి మమతా కులకర్ణ (Mamata Kulkarni) చేసిన రాజీనామా తిరస్కరణకు గురైంది. ఇటీవల ఒక వీడియోలో తన రాజీనామాను ఆమె ప్రకటించగా, తాజాగా తన రాజీనామా తిరస్కరణకు గురైనట్టు శుక్రవారంనాడు మరో వీడియోను ఆమె షేర్ చేశారు. ఆచార్య మహామండలేశ్వర్ లక్ష్మీ నారాయణ్ త్రిపాఠీ తన రాజీనామాను అంగీకరించ లేదని అందులో తెలిపారు.

Delhi New CM: 19-20 తేదీల్లో ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారం


అఖాడాలో కీలక స్థానమైన మహామండలేశ్వర్ హోదాను 52 ఏళ్ల మమతా కులకర్ణి పొందడంతో సభ్యుల మధ్య వివాదాలు చెలరేగాయి. దీంతో ఆమెపై బహిష్కరణకు వేటు పడింది. ఈ నేపథ్యంలో తాను రాజీనామా చేసినట్టు ఫిబ్రవరి 10న మమతా కులకర్ణి ప్రకటించారు. సన్యాసినిగానే కొనసాగుతానని చెప్పారు.


రాజీనామాపై..

తొలుత భావోద్వేగంతో తన హోదాకు రాజీనామా చేశానని, అయితే ఆ తర్వాత గురువుల మార్గదర్శకంలో సనాతన ధర్మానికి సేవలు కొనసాగించేందుకు నిశ్చయించుకున్నానని మమత కులకర్ణి చెప్పారు. ''రెండ్రోజుల క్రితం కొందరు మా గురువుగారైన డాక్టర్ ఆచార్య లక్ష్మీ నారాయణ్ త్రిపాఠిపై తప్పుడు ఆరోపణలు చేశారు. అందుకు ప్రతిగా నేను రాజీనామా చేశాను. అయితే, ఆయన నా రాజీనామాను అంగీకరించలేదు. పదవిలోనే ఉంచినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అఖాడాకు, సనాతన ధర్మ పరిరక్షణకు పునరంకితం అవుతున్నాను'' అని ఆమె చెప్పారు.


ఇవి కూడా చదవండి...

PM Modi: ప్రధాని మోదీ డొనాల్డ్ ట్రంప్ సమావేశం.. అక్రమ వలసదారుల విషయంపై మోదీ కీలక వ్యాఖ్యలు

Chennai: కమల్‌హాసన్‌తో ఉప ముఖ్యమంత్రి భేటీ..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 14 , 2025 | 03:56 PM