Share News

Kumbh Mela: సన్యాసినిగా మమతా కులకర్ణి

ABN , Publish Date - Jan 25 , 2025 | 03:50 AM

తన పేరును శ్రీ యమయ్‌ మమతా నందగిరిగా మార్చుకున్నారు. శుక్రవారం ఉదయం రుద్రాక్ష మాలలు, కాషాయ వస్త్రాలు ధరించి కుంభమేళాకు వచ్చిన మమత.. కిన్నెర అఖాడా ఆచార్య మహామండలేశ్వర్‌ డాక్టర్‌ లక్ష్మీనారాయణ్‌ త్రిపాఠిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం మమతతో లక్ష్మీనారాయణ్‌ గంగానదిలో పూజలు నిర్వహింపజేశారు.

Kumbh Mela: సన్యాసినిగా మమతా కులకర్ణి

కిన్నెర అఖాడాలో చేరిన మాజీ హీరోయిన్‌

శ్రీ యమయ్‌ మమతా నందగిరిగా పేరు మార్పు

మహా మండలేశ్వర్‌గా నియామకం

కుంభమేళాలో పూజలు నిర్వహించిన మమత

మహాదేవుడి ఆదేశాలతోనే భక్తి మార్గమని వెల్లడి

వారణాసి, జనవరి 24: బాలీవుడ్‌ మాజీ హీరోయిన్‌ మమతా కులకర్ణి ఆధ్యాత్మిక మార్గంలోకి మళ్లారు. వారణాసిలోని కుంభమేళాలో కిన్నెర అఖాడాలో చేరి.. తన పేరును శ్రీ యమయ్‌ మమతా నందగిరిగా మార్చుకున్నారు. శుక్రవారం ఉదయం రుద్రాక్ష మాలలు, కాషాయ వస్త్రాలు ధరించి కుంభమేళాకు వచ్చిన మమత.. కిన్నెర అఖాడా ఆచార్య మహామండలేశ్వర్‌ డాక్టర్‌ లక్ష్మీనారాయణ్‌ త్రిపాఠిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం మమతతో లక్ష్మీనారాయణ్‌ గంగానదిలో పూజలు నిర్వహింపజేశారు. నదిలో మమత మూడుసార్లు మునక వేశారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ్‌ మీడియాతో మాట్లాడుతూ, కిన్నెర అఖాడాతో మమత ఏడాదిన్నరగా సంప్రదింపులు జరుపుతున్నారని తెలిపారు. ఆమెను మహా మండలేశ్వర్‌గా నియమిస్తున్నట్లు వెల్లడించారు. ఇకపై తనను శ్రీ యమయ్‌ మమతా నందగిరిగా పిలుస్తామన్నారు. మమత సినిమాల్లో నటించటంపై నిషేధం ఉంటుందా అన్న ప్రశ్నకు బదులిస్తూ.. కిన్నెర అఖాడాలో చేరిన వారు చేసే పనిపై ఎటువంటి నిషేధాలు ఉండవని, ఆమె కావాలనుకుంటే ఆధ్యాత్మిక పాత్రల్లో నటించవచ్చన్నారు. మమత మాట్లాడుతూ.. మహాదేవుడు, మహాకాళి, తన గురువు ఇచ్చిన ఆదేశాల ప్రకారమే తాను సన్యాసినిగా మారానని చెప్పారు.

ghjkl.jpg


ట్రాన్స్‌జెండర్లకు గౌరవం కోసం..

2015లో లక్ష్మీనారాయణ్‌ త్రిపాఠి కిన్నెర అఖడాను ప్రారంభించారు. ట్రాన్స్‌జెండర్లకు (లింగమార్పిడి చేసుకున్న వ్యక్తులకు) సమాజంలో గౌరవం తీసుకువచ్చే లక్ష్యంతో దీనిని నెలకొల్పారు. ట్రాన్స్‌జెండర్లను అఖాడాలో చేర్చుకున్నారు. కాగా, మమతా కులకర్ణి 1990లలో బాలీవుడ్‌లో ప్రముఖ గ్లామర్‌ హీరోయిన్‌గా వెలుగొందారు. కరణ్‌ అర్జున్‌, క్రాంతివీర్‌, ఆషిక్‌ అవారా, సబ్‌సే బడా కిలాడీ, చైనా గేట్‌ తదితర హిట్‌ సినిమాల్లో ఆమె నటించారు. 2002 అనంతరం ఆమె సినిమాలు చేయటం మానేశారు. విదేశాల్లో స్థిరపడిన మమతా కులకర్ణి చాలా కాలం అనంతరం గత ఏడాది డిసెంబరులో స్వదేశానికి తిరిగి వచ్చారు.


ఇవి కూడా చదవండి..

Manish Sisodia: సీఎం చేస్తామంటూ బీజేపీ ఆఫర్: సిసోడియా

Explosion.. మహారాష్ట్రలో భారీ పేలుడు: ఐదుగురి మృతి..

Governor: అత్యాచారాలకు పాల్పడితే ఉరిశిక్షే..

Read More National News and Latest Telugu News

Updated Date - Jan 25 , 2025 | 03:55 AM