Share News

Mamata Banerjee: బెంగాల్‌లో టీఎంసీ ఒంటరిపోరు

ABN , Publish Date - Feb 12 , 2025 | 05:27 AM

కాంగ్రె్‌సకు మరో ‘ఇండీ’ కూటమి పార్టీ ఝలక్‌ ఇచ్చింది. పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రె్‌సతో జట్టుకట్టే ప్రసక్తే లేదని టీఎంసీ అధినేత, సీఎం మమతా బెనర్జీ తేల్చేశారు. వచ్చే ఏడాది మార్చి-ఏప్రిల్లో జరిగే ఈ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని స్పష్టం చేశారు. దరిమిలా టీఎంసీ ఎంపీలు మంగళవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రె్‌సకు పునాదే లేదని.. సొంత పార్టీని పణంగా పెట్టి కూటమి బలోపేతానికి ప్రయత్నించబోమన్నారు.

Mamata Banerjee: బెంగాల్‌లో టీఎంసీ ఒంటరిపోరు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: కాంగ్రె్‌సకు మరో ‘ఇండీ’ కూటమి పార్టీ ఝలక్‌ ఇచ్చింది. పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రె్‌సతో జట్టుకట్టే ప్రసక్తే లేదని టీఎంసీ అధినేత, సీఎం మమతా బెనర్జీ తేల్చేశారు. వచ్చే ఏడాది మార్చి-ఏప్రిల్లో జరిగే ఈ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని స్పష్టం చేశారు. దరిమిలా టీఎంసీ ఎంపీలు మంగళవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రె్‌సకు పునాదే లేదని.. సొంత పార్టీని పణంగా పెట్టి కూటమి బలోపేతానికి ప్రయత్నించబోమన్నారు. ఢిల్లీలో ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ఓటమికి కాంగ్రెస్‌ కారణమని బర్ధమాన్‌-దుర్గాపూర్‌ టీఎంసీ ఎంపీ కీర్తి ఆజాద్‌ మండిపడ్డారు. మిత్రపక్షాలకు ఆ పార్టీ వెన్నుపోటు పొడుస్తోందన్నారు. అసలు ఇండీ కూటమిలో ఉండే హక్కే కాంగ్రె్‌సకు లేదన్నారు. ‘కాంగ్రెస్‌ మునిగిపోయే నావ. దురహంకారంతో వ్యవహరిస్తోంది. కూటమికి మమత సారథిగా ఉండాలని ప్రజలు కోరుతున్నారు’ అని వ్యాఖ్యానించారు. మమతకు సమాజ్‌వాదీ ఎంపీ రాంగోపాల్‌ యాదవ్‌ కూడా మద్దతు ప్రకటించారు. రాజకీయాల్లో ఎప్పటికప్పుడు సమీకరణలు మారుతుంటాయని, ఎన్నికల ముందు పరిస్థితులు మారవచ్చని జేఎంఎం ఎంపీ మహువా మాజీ అన్నారు.


మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: ప్రభుత్వానికి రుణ మంజూరు పత్రాలు అందజేసిన హడ్కో ప్రతినిధులు

Also Read: కేటీఆర్‌తోపాటు ఆయన ఫ్యామిలీ దరఖాస్తు చేసుకుంటే..

Also Read: సీఐడీ మాజీ డీజీ పీవీ సునీల్ కుమార్‌పై విచారణలో కీలక పరిణామం

Also Read: ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారి

Also Read : అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్

Also Read : పీజీ మెడికల్ సీట్లలో స్థానికత కోటా విచారణకు అనుమతించిన సుప్రీంకోర్టు

Also Read: వీఐపీల భద్రత కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం

Also Read: బెల్ట్ షాపులు నిర్వహిస్తే.. కేసు నమోదు

For National News And Telugu News

Updated Date - Feb 12 , 2025 | 05:27 AM