Make In India On Every Weapon: ప్రతి ఆయుధం మీద మేకిన్ ఇండియా
ABN , Publish Date - Sep 26 , 2025 | 06:19 AM
చిప్‌ల నుంచి షిప్‌ల వరకు దేశంలోనే అన్నీ తయారయ్యే విధంగా ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. దేశ రక్షణ వ్య వస్థకు సంబంధించి అన్ని ఆయుధాల విడిభాగాల...
చిప్‌ల నుంచి షిప్‌ల దాకా ఇక్కడే తయారీ
జీఎస్టీతో అన్ని ధరలు తగ్గాయి: మోదీ
గ్రేటర్ నోయిడా, సెప్టెంబరు 25: చిప్‌ల నుంచి షిప్‌ల వరకు దేశంలోనే అన్నీ తయారయ్యే విధంగా ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. దేశ రక్షణ వ్య వస్థకు సంబంధించి అన్ని ఆయుధాల విడిభాగాల మీద ‘మేక్ ఇన్ ఇండియా’ ముద్ర ఉండేటట్లు చూస్తామని ప్రకటించారు. గురువారం ఆయన ఢిల్లీ శివారులోని గ్రేటర్ నోయిడాలో ఉత్తరప్రదేశ్ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, భారత సైనిక వ్యవస్థ కూడా దేశీయ ఆయుధాలనే కోరుకుంటోందని, ఇతర దేశాల మీద ఆధారపడకూడదనే అభిప్రాయంతో ఉందని తెలిపారు. రష్యా భాగస్వామ్యంతో ఉత్తరప్రదేశ్‌లో ఏకే-203 రైఫిళ్లను తయారు చేస్తున్నట్లు ప్రకటించారు. వీటి ఉత్పత్తి త్వరలో ప్రారంభం అవుతుందన్నారు. యూపీలో కేవలం రక్షణ ఉత్పత్తుల కోసం ప్రత్యేక కారిడార్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దేశంలో వ్యాపారులు చేసే చిన్నచిన్న తప్పులకు కూడా భారీ శిక్షలు పడే విధంగా చట్టాలు ఉ న్నాయని, వాటిని సవరిస్తామని ప్రకటించారు. దేశంలో తయారయ్యే మొబైల్ ఫోన్లలో 55ు ఉత్తరప్రదేశ్‌లోనే తయారవుతున్నాయని మోదీ వెల్లడించారు. ఇప్పుడు ప్రపంచంలో మొబైల్ ఫోన్ల తయారీలో భారత్ రెండో స్థానంలో ఉందని చెప్పారు. జీఎస్టీ సంస్కరణలతో టూత్‌పే్‌స్ట మొదలు ట్రాక్టర్ల దాకా అన్ని వస్తువుల ధరలు తగ్గాయని ఆయన చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కృష్ణమ్మకు వరద పోటు.. ప్రభుత్వం అలర్ట్
అసెంబ్లీలో ఆమోదం పొందనున్న పలు బిల్లులు
For More AP News And Telugu News