Chennai: అమ్మో.. పెద్దప్రమాదమే తప్పిందిగా.. రైలు పట్టాలపై ఇనుప రాడ్..
ABN , Publish Date - Jun 19 , 2025 | 11:48 AM
సేలం జిల్లా శంకగిరి వద్ద రైలు పట్టాలపై గుర్తు తెలియని దుండగులు పొడవైన ఇనుపరాడ్ పెట్టడం కలకలం రేపుతోంది. ఆ మార్గంలో వెళుతున్న ఏర్కాడు ఎక్స్‌ప్రె్‌సను కూల్చేందుకే ఈ కుట్రకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈరోడ్ నుండి సేలం, జోలార్‌పేట మీదుగా చెన్నై రోజూ ఏర్కాడు ఎక్స్‌ప్రెస్ నడుపుతున్నారు.
- ఏర్కాడు ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ముప్పు
చెన్నై: సేలం జిల్లా శంకగిరి(Shankagiri) వద్ద రైలు పట్టాలపై గుర్తు తెలియని దుండగులు పొడవైన ఇనుపరాడ్ పెట్టడం కలకలం రేపుతోంది. ఆ మార్గంలో వెళుతున్న ఏర్కాడు ఎక్స్‌ప్రె్‌సను కూల్చేందుకే ఈ కుట్రకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈరోడ్ నుండి సేలం, జోలార్‌పేట మీదుగా చెన్నై రోజూ ఏర్కాడు ఎక్స్‌ప్రెస్ నడుపుతున్నారు. మంగళవారం రాత్రి 9 గంటలకు ఈరోడ్ నుంచి ఆ రైలు బయలుదేరి సేలం జిల్లా శంకగిరి సమీపం మావేలిపాళయం స్టేషన్ దాటుకుని మకుటంచావిడి వద్ద వెళుతుండగా దాని పట్టాల కింద పొడవైన ఇనుపరాడ్ చిక్కుకుని పెద్ద శబ్దంతో ఈడ్చుకెళ్ళింది.
ఆ శబ్ధం విని లోకో పైలెట్ వెంటనే రైలు నిలిపివేశారు. కిందుకు దిగి చూడగా పొడవైన ఇనుపరాడ్ చక్రాల్లో చిక్కుకుని ఉండటాన్ని గమనించారు. దీంతో ఇంజన్ మరమ్మతుకు గురైంది. వెంటనే డ్రైవర్ ఆ విషయాన్ని రైల్వే జోనల్ ఉన్నతాధికారులకు ఫోన్‌చేసి తెలిపాడు. రైల్వే అధికారులు, సేలం, ఈరోడ్ రైల్వే పోలీసులు డాగ్ స్క్వాడ్‌తో హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఏర్కాడు ఎక్స్‌ప్రె్‌సను కూల్చివేయాలనే ఆలోచనతోనే గుర్తు తెలియని దుండగులు పదడుగుల పొడవైన ఇనుపరాడ్‌ను రైలుపట్టాలపై ఉంచినట్లు గుర్తించారు.
దుండగులను గుర్తించేందుకు వెళ్లిన పోలీసు జాగిలం కిలోమీటర్ వెళ్ళి తిరిగొచ్చింది. ఇదిలా ఉండగా ఆ రైలును మార్గమధ్యంలో నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆ తర్వాత సేలం నుండి మరో రైలింజన్‌ను తెప్పించిన మీదట ఆ రైలు రెండు గంటలు ఆలస్యంగా రాత్రి 11.45 గంటలకు బయలుదేరింది. ఈ సంఘటన కారణంగా ఈరోడ్ మార్గంమీదుగా చెన్నై, బెంగళూరు నగరాలకు వెళ్లే మూడు రైళ్ళను అక్కడక్కడా నిలిపేశారు. ఆ రైళ్లు కూడా గంట ఆలస్యంగా గమ్యస్థానాల వైపు బయలుదేరాయి. ఈ సంఘటనపై రైల్వే డీఎస్పీ బాబు మాట్లాడుతూ అక్కడ మందుబాబులు మద్యం తాగి ఇనుపరాడ్‌ను పట్టాలపై వేసి వెళ్ళి ఉంటారన్నారు. ఈ ప్రాంతం గ్రామాలకు దూరంగా ఉండటం, సీసీ కెమెరాలు లేకపోవటం వల్ల దుండగులను గుర్తించడంలో కాస్త జాప్యం జరుగవచ్చని చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి.
విదేశాల్లో ఉద్యోగాల పేరిట మోసం
ఈ నెలాఖరులోపు బకాయిలు చెల్లించాల్సిందే
Read Latest Telangana News and National News