Share News

High Court: మంత్రికి షాకిచ్చిన హైకోర్టు.. ఏం జరిగిందంటే..

ABN , Publish Date - Apr 25 , 2025 | 12:03 PM

రాష్ట్ర మంత్రి ఒకరికి హైకోర్టు గట్టి షాకిచ్చింది. ఆయనపై నమోదైన కేసును మళ్ళీ విచారించాలని ఆదేశాలివ్వడంతో మంత్రి చిక్కుల్లో పడ్డట్లయింది. డీఎంకే సీనియర్‌ నేత, రాష్ట్ర మంత్రి దురైమురుగన్‌కు మద్రాస్‌ హైకోర్టు గట్టి షాకిచ్చింది. ఆయనపై నమోదైన కేసులను మళ్ళీ విచారించాలని ఆదేశించింది. దీంతో మంత్రి కాస్త చిక్కుల్లో పడ్డట్లయింది.

High Court: మంత్రికి షాకిచ్చిన హైకోర్టు.. ఏం జరిగిందంటే..

- అవినీతి కేసు విచారణకు ఆదేశం

- 6 నెలల్లో పూర్తి చేయాలని గడువు

చెన్నై: డీఎంకే సీనియర్‌ నేత, రాష్ట్ర మంత్రి దురైమురుగన్‌(Durai Murugan)కు మద్రాస్‌ హైకోర్టు గట్టి షాకిచ్చింది. ఆయనపై నమోదైన మరో అవినీతి కేసును రోజూ విచారించి, ఆరు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించింది. 1996-2001 వరకు మంత్రిగా ఉన్న సమయంలో దురైమురుగన్‌ ఆదాయానికి ఆస్తులు సంపాదించారంటూ ఆయనపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసును విచారించిన వేలూరు కోర్టు... దురైమురుగన్‌కు విముక్తి కల్పించింది. ఈ తీర్పుపై ఏసీబీ అధికారులు హైకోర్టులో అప్పీల్‌ చేశారు.

ఈ వార్తను కూడా చదవండి: Minister: చిక్కుల్లో రాష్ట్రమంత్రి.. ఆ వ్యాఖ్యలే ఆయన కొంపముంచనున్నాయా..


ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తి వేల్‌ మురుగన్‌.. మంత్రి దురైమురుగన్‌పై నమోదైన కేసును మళ్ళీ విచారించాలని ఆదేశిస్తూ, గతంలో వేలూరు కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేస్తూ బుధవారం తీర్పునిచ్చిన విషయం తెల్సిందే. ఇదిలావుంటే మరో ఆదాయానికి మించిన కేసు విచారణ కూడా ఆరు నెలల్లో పూర్తి చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. 2006-2011 మధ్య డీఎంకే ప్రభుత్వ హయాంలో ప్రజాపనుల శాఖామంత్రిగా వ్యవహరించిన దురైమురుగన్‌... 2007-09 మధ్య కాలంలో ఆదాయానికి మంచి రూ.1.40 కోట్ల విలువ చేసే ఆస్తులను పోగు చేశారంటూ 2011లో ఏసీబీ అధికారులు మంత్రి దురైమురుగన్‌తో పాటు ఆయన భార్యపై కేసు నమోదు చేశారు.


nani2.2.jpg

ఈ కేసును మొదట విచారించిన వేలూరు కోర్టు.. వీరిద్దరికీ 2017లో విముక్తి కల్పించింది. ఈ తీర్పుపై కూడా ఏసీబీ అధికారులు హైకోర్టులో రివ్యూ పిటిషన్‌ వేయగా, దీనిపై న్యాయమూర్తి వేల్‌మురుగన్‌ విచారించారు. ఆ సమయలో దురైమురుగన్‌, ఆయన భార్య తరపున హాజరైన న్యాయవాదులు తమతమ వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు ఆలకించిన న్యాయమూర్తి అవినీతి కేసులో దురైమురుగన్‌తో పాటు ఆయన భార్యకు విముక్తి కల్పిస్తూ కింది కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయడంతో పాటు ఈ కేసు విచారణ రోజువారీగా చేపట్టి ఆరు నెలల్లో పూర్తి చేయాలని వేలూరు ప్రత్యేక కోర్టును జస్టిస్‌ వేల్‌ మురుగన్‌ ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి

దేశ భద్రతపై కాంగ్రెస్‌ చౌకబారు రాజకీయాలు

పంచాయతీలకు ఎన్నికల్లేవు.. అభివృద్ధికి నిధుల్లేవు!

కౌశిక్‌ రెడ్డికి హైకోర్టులో స్వల్ప ఊరట

పర్యాటకుల మతం అడిగి పాశవికంగా కాల్చారు

ఫస్ట్ టైం తెలుగులో...

Read Latest Telangana News and National News

Updated Date - Apr 25 , 2025 | 12:03 PM