BJP: దేశ భద్రతపై కాంగ్రెస్ చౌకబారు రాజకీయాలు
ABN , Publish Date - Apr 25 , 2025 | 04:41 AM
దేశ భద్రతపై కాంగ్రెస్ చౌకబారు రాజకీయాలు చేస్తోందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ మండిపడ్డారు.

పహల్గాం దాడిపై బీఆర్‌ఎస్ మాట్లాడదేం?: లక్ష్మణ్
హైదరాబాద్, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): దేశ భద్రతపై కాంగ్రెస్ చౌకబారు రాజకీయాలు చేస్తోందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ మండిపడ్డారు. పహల్గాంలో ఉగ్రదాడిపై దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు వెల్లువెత్తుతుంటే కాంగ్రెస్ మాత్రం దీనిని రాజకీయ కోణంలో చూస్తోందని విమర్శించారు.
గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రె్‌సకు పాకిస్తాన్‌పై ప్రేమ కొత్తది కాదని మండిపడ్డారు. ప్రతీ చిన్న విషయానికి సోషల్ మీడియా ద్వారా స్పందించే బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. పహల్గాం ఘటనపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.