Madhya Pradesh: రైల్వే స్టేషన్‌లో ఫోన్ పే పని చేయడం లేదన్నందుకు.. కాలర్ పట్టి బెదిరించి.. చివరికి..
ABN , Publish Date - Oct 21 , 2025 | 08:52 AM
రైల్వే స్టేషన్‌లో ఫోన్ పే పని చేయడం లేదని ప్రయాణికుడి దగ్గర సమోసా వ్యాపారి బలవంతంగా వాచ్ లాగేసుకున్నాడు. రైలు ఆగాకా తినుబండారాలు కొనేందుకు ఓ వ్యక్తి ప్లాట్ ఫామ్ మీదకు వచ్చాడు. సమోసా వ్యాపారి దగ్గర సమోసా తీసుకున్నాక డబ్బులు చెల్లించేందుకు ఫోన్ పేలో డబ్బులు పంపించగా.. అది పనిచేయలేదు.
ఇంటర్నెట్ డెస్క్, అక్టోబర్ 21: దేశంలోని పలు నగరాల్లో వ్యాపారాలు రెచ్చిపోతున్నారు. తమ వస్తువులు లేదా ఫుడ్ ఐటమ్స్ కోనేవరకు సైలెంట్‌గా ఉండి, ఐటమ్స్ రిజెక్ట్ చేస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారు. మధ్యప్రదేశ్‌లో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. రైల్వే స్టేషన్‌లో ఫోన్ పే పని చేయడం లేదని ప్రయాణికుడి దగ్గర సమోసా వ్యాపారి బలవంతంగా వాచ్ లాగేసుకున్నాడు. రైలు ఆగాకా తినుబండారాలు కొనేందుకు ఓ వ్యక్తి ప్లాట్ ఫామ్ మీదకు వచ్చాడు. సమోసా వ్యాపారి దగ్గర సమోసా తీసుకున్నాక డబ్బులు చెల్లించేందుకు ఫోన్ పేలో డబ్బులు పంపించగా.. అది పనిచేయలేదు.
దీంతో రైలు వెళ్ళిపోతుందని సమోసాను ప్రయాణికుడు తిరిగి ఇచ్చేశాడు. రిటర్న్ తీసుకోబోమని, డబ్బులు ఇచ్చి తీరాల్సిందేనని సమోసా వ్యాపారి హెచ్చరించారు. ప్రయాణికుడి కాలర్ పట్టుకొని, డబ్బులు కట్టమని బలవంతం చేశాడు. రైలు వెళ్లిపోతుండడంతో ఏమి చేయలేక తన చేతికున్న వాచ్ ఇచ్చేసి సమోసా తీసుకొని ప్రయాణికుడు వెళ్ళిపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసి సమోసా వ్యాపారిని అరెస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి:
Maoists: కేంద్రంపై మండిపడ్డ మావోయిస్టులు.. మరో సంచలన నిర్ణయం
Diwali Celebrations 2025: దేశవ్యాప్తంగా మిన్నంటిన దీపావళి సంబరాలు..