Share News

Diwali Celebrations 2025: దేశవ్యాప్తంగా మిన్నంటిన దీపావళి సంబరాలు..

ABN , Publish Date - Oct 20 , 2025 | 09:18 PM

సామాన్యులే కాదు సినీ సెలెబ్రిటీలు కూడా దీపావళిని ఎంతో అద్భుతంగా జరుపుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో జరిగిన దీపావళి సంబరాల్లో హీరో వెంకటేష్, నాగార్జున దంపతులు, నయన తార పాల్గొన్నారు.

Diwali Celebrations 2025: దేశవ్యాప్తంగా మిన్నంటిన దీపావళి సంబరాలు..
Diwali Celebrations 2025

దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. కాశ్మీర్ టు కన్యాకుమారి వరకూ పండుగ అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక పూజలు, పిండి వంటల విందులతో జనం సందడి చేశారు. సాయంత్రం నుంచి టపాసుల సవ్వడి మొదలైంది. చిన్న పిల్లల దగ్గరి నుంచి ముసలి వారి వరకు టపాసులు పేల్చి సంతోషించారు. ఇక, దీపాల కాంతుల్లో ప్రతీ హిందూ గృహం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. అయోధ్యలో దీపావళి సంబరాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. రామ మందిరం దీపాల కాంతుల్లో ధగధగలాడుతోంది.


రామ భక్తులు సరయ నది ఒడ్డున లక్షలాది దీపాలను వెలిగించారు. దేశంలోని ప్రధాన హిందూ మందిరాల్లో సైతం దీపావళి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. జనం పెద్దఎత్తున గుళ్లకు వెళ్లి పూజలు చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ దీపావళి వేడుకల్ని ప్రత్యేకంగా జరుపుకున్నారు. ఐఎన్ఎస్ విక్రాంత్‌లో పర్యటించారు. ఐఎన్ఎస్ విక్రాంత్‌ క్రూ మెంబర్స్‌తో కలిపి పండుగ జరుపుకున్నారు. వారికి స్వీట్లు సైతం పంచి పెట్టారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.


టాలీవుడ్ టు బాలీవుడ్ దీపావళి సంబరాలు

సామాన్యులే కాదు సినీ సెలెబ్రిటీలు కూడా దీపావళిని ఎంతో అద్భుతంగా జరుపుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో జరిగిన దీపావళి సంబరాల్లో హీరో వెంకటేష్, నాగార్జున దంపతులు, నయన తార పాల్గొన్నారు. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవే తన ఎక్స్ ఖాతాలో తెలియజేశారు. సంతోషం వ్యక్తం చేశారు. ఇక, బాలీవుడ్‌లో రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ ఇంట్లో దీపావళి సెలెబ్రేషన్స్ జరిగాయి. ఈ వేడుకకు కరీనా కపూర్, కరిష్మా కపూర్, అలేఖ వాణి జైన్, నందనీ తాషా, అనీషా మల్హోత్రా జైన్, నీతూ కపూర్ వంటి పలువురు ప్రముఖులు హాజరయ్యారు.


ఇవి కూడా చదవండి

హైదరాబాద్‌లో ఆకట్టుకున్న దీపావళి సంబరాలు

సీఎం రేవంత్‌రెడ్డితో కొండా దంపతుల భేటీ

Updated Date - Oct 20 , 2025 | 10:01 PM