Passenger Rush: పండుగ సీజన్.. రైల్వే స్టేషన్‌లల్లో భారీగా రద్దీ
ABN , Publish Date - Oct 19 , 2025 | 09:55 PM
పండుగ సీజన్ నేపథ్యంలో ఉత్తరాదిన పలు రైల్వే స్టేషన్‌లలో భారీ రద్దీ నెలకొంది. మహానగరాల్లోని అనేక మంది ఈశాన్య రాష్ట్రాలకు తరలివెళుతుండంతో ముంబై, సూరత్, ఢిల్లీ రైల్వే స్టేషన్‌లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి.
ఇంటర్నెట్ డెస్క్: పండుగ సీజన్ కోసం సొంతూళ్లకు వెళ్లేందుకు జనాలు రైల్వే స్టేషన్‌లకు భారీగా క్యూకడుతుండటంతో రద్దీ విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా ముంబై, ఢిల్లీ, సూరత్ వంటి నగరాల నుంచి జనాలు పెద్ద ఎత్తున జనాలు ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లేందుకు సిద్ధం కావడంతో అక్కడి స్టేషన్‌లల్లో ఇసుక వేస్తే రాలనంత రద్దీ నెలకొంది. తీవ్ర ఇక్కట్లు పడుతున్న ప్రయాణికులు రైల్వే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు (Huge Rush In Railway Stations).
పండుగ సీజన్ రద్దీని తట్టుకునేందుకు అనేక స్పెషల్ రైళ్లను ఏర్పాటు చేసినట్టు రైల్వే అధికారులు తెలిపారు. కానీ డిమాండ్‌కు తగ్గట్టు రైళ్లు అందుబాటులో లేక తాము ఇబ్బంది పడుతున్నట్టు ప్రయాణికులు వాపోతున్నారు.
ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉండటంతో సూరత్‌లో ఉధ్నా స్టేషన్ కిక్కిరిసిపోయింది. రైల్లోకి ఎక్కేందుకు ప్రయాణికులు ఏకంగా 12 గంటల పాటు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.
ముంబైలో రద్దీ నియంత్రణకు పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేయాల్సి వచ్చింది. కానీ టిక్కెట్లు దొరక్క, అధిక ధరలకు టిక్కెట్లు కొనలేక జనాలు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు.
ఝాన్సీ, కాన్పూర్ స్టేషన్‌ల్లో కూడా దాదాపు ఇదే సీన్ కనిపించింది. కొందరు రైలు బాత్రూమ్‌లో కూర్చుని ప్రయాణించారు. రాజస్థాన్‌లోని పాలీ స్టేషన్‌లో కొందరు బోగీలకున్న తలుపులు పట్టుకుని వేలాడుతూ జర్నీ చేసేందుకు సాహసించారు. మరికొందరు రైలు టాపు ఎక్కి ప్రయాణించేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో రైల్వే అధికారులు చేసిన ఏర్పాట్లపై అనేక మంది పెదవి విరిచారు. కనీస అవసరాలకు తగినట్టు కూడా ఏర్పాట్లు లేవని అన్నారు.
ఇవి కూడా చదవండి:
బెంగళూరులో దారుణం.. సీనియర్ విద్యార్థినిపై కాలేజ్ స్టూడెంట్ అత్యాచారం!
పంజాబ్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఇళ్లల్లో సోదాలు.. రూ.5 కోట్లు లభ్యం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి