Lung Diseases: 45 ఏళ్లు దాటితే ఊపిరితిత్తుల వ్యాధులు అధికం
ABN , Publish Date - Sep 03 , 2025 | 03:18 AM
భారత్‌లో 45 ఏళ్లకు పైబడిన వారిలో 14ు కంటే ఎక్కువ మంది ఊపిరితిత్తుల వ్యాధుల ప్రభావానికి గురవుతున్నారని ముంబైలోని..
న్యూఢిల్లీ, సెప్టెంబరు 2: భారత్‌లో 45 ఏళ్లకు పైబడిన వారిలో 14ు కంటే ఎక్కువ మంది ఊపిరితిత్తుల వ్యాధుల ప్రభావానికి గురవుతున్నారని ముంబైలోని ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్ బృందం చేసిన అధ్యయనంలో వెల్లడైంది. అమెరికాలోని సదరన్ కాలిఫోర్నియా వర్సిటీ, హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌కు చెందిన పరిశోధకులతో కలిసి ఈ బృందం దాదాపు 31వేల మందిని పరీక్షించింది. ఈ క్రమంలో 45ఏళ్లకు పైబడిన వారిలో ఎక్కువ మంది ఊపిరితిత్తులకు వాపు, నష్టం కలిగించి, శ్వాస ప్రవాహాన్ని అడ్డుకునే క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (సీవోపీడీ)కు గురయ్యారని పరిశోధకులు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మణిపూర్‌లో పర్యటించనున్న ప్రధాని మోదీ..!
ఏపీ మహేష్ బ్యాంక్‌కు షాక్ ఇచ్చిన ఈడీ
For More National News And Telugu News