Los Angeles Protests: లాస్ ఏంజెలె్‌సకు నేషనల్ గార్డ్స్
ABN , Publish Date - Jun 09 , 2025 | 05:17 AM
నిరసనకారుల ఆందోళనలు రెండో రోజుకు చేరడంతో అధ్యక్షుడు ట్రంప్ శనివారం 2వేల మంది నేషనల్ గార్డ్ దళాలను నగరంలో మోహరించారు.
న్యూఢిల్లీ, జూన్ 8: అక్రమ వలసదారులను గుర్తించేందుకు అధికారులు చేపట్టిన ఆకస్మిక తనిఖీలతో అమెరికాలోని లాస్ ఏంజెలెస్ రణరంగంగా మారింది. నిరసనకారుల ఆందోళనలు రెండో రోజుకు చేరడంతో అధ్యక్షుడు ట్రంప్ శనివారం 2వేల మంది నేషనల్ గార్డ్ దళాలను నగరంలో మోహరించారు. లాస్ ఏంజెలె్‌సలో పెరుగుతున్న చట్టవిరుద్ధ చర్యలను అడ్డుకొని, సమస్యను పరిష్కరించడానికి ఈ బలగాలు కనీసం 60 రోజుల పాటు అక్కడే ఉంటాయని వైట్ హౌస్ తెలిపింది. హింసాకాండ ఇలాగే కొనసాగితే నావికా దళాన్ని రంగంలోకి దించుతామని రక్షణ మంత్రి పీట్ హెగ్సేత్ హెచ్చరించారు. లాస్ ఏంజెలి్‌సలో నేషనల్ గార్డ్ దళాల మోహరింపు నిర్ణయాన్ని కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ తప్పుబట్టారు. ట్రంప్ ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పట్టణ పేదరిక నిర్మూలనకు కృషి.. ఏపీ మెప్మాకు అవార్డుల పంట
For Telangana News And Telugu News