Chess: జాతీయ చదరంగం చాంపియన్‌షిప్ లోగో ఆవిష్కరణ
ABN , Publish Date - Sep 06 , 2025 | 05:07 AM
ఈ నెల 20 నుంచి అక్టోబరు 1 వరకు గుంటూరులోని విజ్ఞాన్ విశ్వవిద్యాలయంలో జరగబోయే 62వ జాతీయ చదరంగం చాంపియన్‌షిప్..
గుంటూరు, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): ఈ నెల 20 నుంచి అక్టోబరు 1 వరకు గుంటూరులోని విజ్ఞాన్ విశ్వవిద్యాలయంలో జరగబోయే 62వ జాతీయ చదరంగం చాంపియన్‌షిప్-2025 లోగోని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీఎస్ నరసింహ ఆవిష్కరించారు. శుక్రవారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, విశ్రాంత న్యాయమూర్తి డీవీవీఎస్ సోమయాజులు, డీఎ్‌సఎన్‌ఎల్‌యూ ఉపకులపతి ఆచార్య డాక్టర్ డి.సూర్యప్రకాశరావు, ఆంధ్ర చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు అడుసుమిల్లి సురేష్, సెక్రటరీ కె.జగదీష్, ముఖ్య సలహాదారు కేవీవీ శర్మ పాల్గొన్నారు. ఈ చాంపియన్‌షి్‌పలో దేశ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన గ్రాండ్, ఇంటర్నేషనల్ మాస్టర్స్ పోటీపడనున్నారు. మహిళల గ్రాండ్ మాస్టర్లు, ఇంటర్నేషనల్ మాస్టర్లు పాల్గొని తమ నైపుణ్యాలను ప్రదర్శించనుండటంతో ఇదొక హై ప్రొఫైల్ టోర్నమెంట్‌గా మారనుంది.
ఇవి కూడా చదవండి
భారత్‌లో తొలి టెస్లా కారు డెలివరీ.. కస్టమర్ ఎవరంటే..
భారత్‌ను ముక్కలు చేయాలంటూ పోస్టు.. ఆస్ట్రియా ఆర్థికవేత్త ఎక్స్ అకౌంట్‌పై నిషేధం
For More National News and Telugu News