Russian Woman Husband: నాకు చెప్పకుండానే గోవా వదిలి వెళ్లింది... రష్యా మహిళ భర్త వెల్లడి
ABN , Publish Date - Jul 16 , 2025 | 05:58 PM
రష్యా మహిళ నైనాను, పిల్లల్ని చూసేందుకు వెళ్లానని, అయితే పిల్లలతో ఎక్కువ సేపు గడిపే అవకాశం ఆమె ఇవ్వలేదని ఆమె భర్త చెప్పారు. నైనాకు ప్రతినెలా అవసరమైన డబ్బులు పంపుతున్నట్టు తెలిపారు. పిల్లల అవసరాలకు అవసరమైనంత ఆమె దగ్గర ఉందని వివరించారు.
బెంగళూరు: కర్ణాటకలోని గోకర్ణలో ఒక మారుమూల గుహలో రెండువారాల పాటు జీవనం సాగించిన రష్యా మహిళ (Russian woman) నైనా కుటినా (Nina Kutina) ఇటీవల అందరి దృష్టిని ఆకర్షించారు. ఆధ్యాత్మిక సాధనలపై ఆసక్తితో ఇద్దరు పిల్లలతో ఆమె గుహలో ఉండటం గమనించిన పోలీస్ పెట్రోలింగ్ టీమ్ ఆమెకు నచ్చచెప్పి స్థానిక ఆశ్రమానికి చేర్చారు. రష్యాకు తిప్పి పంపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజాగా నైనా కుటినాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను ఆమె భర్త డ్రోర్ గోల్డ్‌స్టెయిన్ (Dror Goldstein) వెల్లడించారు. ఇజ్రాయెల్ నివాసి అయిన గోల్డ్‌స్టయిన్ తనకు చెప్పకుండానే నైనా కుటినా గోవా విడిచి వెళ్లినట్టు తెలిపారు.
'ఎనిమిదేళ్ల క్రితం నైనా కుటినాను గోవాలో కలిసాను. ఆమెతో ప్రేమలో పడ్డాను. ఇండియాలో మేము ఏడు నెలలు కలిసి ఉన్నాం. ఆ తర్వాత ఉక్రెయిన్‌లో ఎక్కువ సమయం గడిపాం. తన కుమార్తెలు ప్రేమ (6), అమా (5)లను కలుసుకునేందుకు గత నాలుగేళ్లుగా ఇండియాకు వస్తున్నాను. కొద్ది నెలల క్రితం నాకు చెప్పకుండానే ఆమె గోవా విడిచి వెల్లింది. వాళ్లెక్కడున్నారో నాకు తెలియలేదు. వాళ్లు కనిపించకుండా పోయినట్టు ఫిర్యాదు కూడా చేశాను. నీనా, తమ కుమార్తెలు గోకర్ణలో ఉన్నట్టు తెలుసుకున్నాను' అని గోల్డ్‌స్టయిన్ చెప్పారు.
నైనాను, పిల్లల్ని చూసేందుకు వెళ్లానని, అయితే పిల్లలతో ఎక్కువ సేపు గడిపే అవకాశం ఆమె ఇవ్వలేదని చెప్పారు. నైనాకు ప్రతినెలా అవసరమైన డబ్బులు పంపుతున్నట్టు తెలిపారు. పిల్లల అవసరాలకు అవసరమైనంత ఆమె దగ్గర ఉందని వివరించారు. పిల్లలను రష్యాకు తిరిగిపంపే విషయంపై మాట్లాడుతూ, వాళ్లను అక్కడికి తీసుకువెళ్లడం తనకు కష్టమవుతుందని చెప్పారు. వాళ్లను ప్రభుత్వం రష్యాకు పంపకుండా తన ప్రయత్నాలు తాను చేస్తానని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
నిన్నటి ఆయుధాలతో నేడు యుద్ధంలో గెలువలేము
చైనా పర్యటనకు మోదీ.. గల్వాన్ ఘర్షణల తర్వాత ఇదే మొదటిసారి
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి