Kolkata Airport on High Alert: బాంబు బెదిరింపు కాల్.. కోల్‌కతా ఎయిర్‌పోర్టులో హైఅలర్ట్
ABN , Publish Date - May 13 , 2025 | 05:31 PM
ఇండిగో విమానంలో బాంబు ఉందంటూ బెదిరింపు కాల్ రావడంతో కోల్‌కతా అంతర్జాతీయ విమానాశ్రయంలో హైఅలర్ట్ ప్రకటించారు.
ఇంటర్నెట్ డెస్క్: విమానంలో బాంబు ఉందంటూ బెదిరింపు కాల్ రావడంతో కోల్‌కతాలోని నేతాజీ శుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నేడు హైఅలర్ట్ ప్రకటించారు. ముంబైకి వెళ్లనున్న ఇండిగో విమానంలో బాంబు ఉన్నట్టు గుర్తు తెలియని వ్యక్తి కాల్ చేయడంతో భద్రతా దళాలు వెంటనే అప్రమత్తమయ్యాయి. ప్రయాణికులను విమానం నుంచి దింపేసి తనిఖీలు నిర్వహించాయి.
ప్రయాణికులందరూ విమానంలో కూర్చున్న తరువాత ఈ కాల్ వచ్చిందని అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 1.30గంటలకు విమానం టేకాఫ్ అవ్వాల్సి ఉందని వివరించారు. ఈలోపు బెదిరింపు కాల్ రావడంతో ఎమర్జెన్సీ ప్రొటోకాల్ ప్రకారం మొత్తం 195 మంది ప్రయాణికులను కిందకు దింపి విమానాన్ని ఐసోలేషన్ బేకు తరలించినట్టు వివరించారు.
‘‘లగేజీలను కిందకు దించాము. బాంబ్ స్క్వాడ్ సిబ్బంది విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది ఎయిర్‌పోర్టు అంతటా భద్రతను కట్టుదిట్టం చేశారు’’ అని అధికారులు పేర్కొన్నారు.
ఆపరేషన్ సిందూర్ తరువాత ఎయిర్‌పోర్టులకు ఇలాంటి బెదిరింపు కాల్ రావడం ఇది రెండోసారి. అంతకుమునుపు మే 6న ముంబై ఎయిర్‌పోర్టుకు కూడా ఇలాంటి బెదిరింపు కాల్ వచ్చింది. చండీగఢ్ నుంచి రానున్న ఇండిగో విమానంలో బాంబు ఉన్నట్టు గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి చెప్పారు. ఆ తరువాత తనిఖీల సందర్భంగా అది నకిలీ కాల్ అని తేలింది.
ఇవి కూడా చదవండి..
Terrorists Trapped: జుమ్మూలో భారీ ఎన్ కౌంటర్.. ముగ్గురు లష్కర్ ఈ తోయిబా ఉగ్రవాదుల హతం
Operation Sindoor: అణువణువూ జల్లెడ పడుతున్న భారత్.. ఆచూకీ చెబితే 20 లక్షలు
మోదీ సర్‌ప్రైజ్... ఆదంపూర్ ఎయిర్‌బేస్‌లో జవాన్లను కలిసిన ప్రధాని..