Rahul Gandhi: రాహుల్ గాంధీ బిహార్ యాత్రలో అపశృతి..
ABN , Publish Date - Aug 22 , 2025 | 07:00 AM
ఓటర్ అధికార్ ర్యాలీ జరిగిన రోజున తనను భగత్ సింగ్ చౌక్‌లో శాంతిభద్రతల విధుల్లో ఉంచారని బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. మధ్యాహ్నం 12:00 గంటలకు ఓటర్ అధికార్ ర్యాలీ ముగిసిన తరువాత తాను రాహుల్ గాంధీ కారు ముందు కాలు జారి పడ్డానని పేర్కొన్నాడు.
బిహార్: బిహార్ రాష్ట్రంలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దొంగ ఓట్లకు వ్యతిరేకంగా చేపట్టిన ఓటరు అధికార్ యాత్రలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితం నవాడా జిల్లాలో ఓటరు అధికార్ యాత్ర నిర్వహిస్తున్న సమయంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ వాహనం ఒక పోలీసు కానిస్టేబుల్‌ను ఢీకొట్టింది. దీంతో అతనికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు కానిస్టేబుల్‌కు ప్రథమ చికిత్స అందించారు. సదర్ SDPO ఫారెస్ట్ బాడీగార్డ్‌గా నియమించబడిన మహేష్ కుమార్ అనే కానిస్టేబుల్ రాహుల్ వాహనం భగత్ సింగ్ చౌక్ గుండా వెళుతుండగా కాలు జారి కిందపడిపోయాడు. దీంతో అతనికి తీవ్రగాయాలయ్యాయి. కాగా, ఈ ఘటనకు సంబంధించిన డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీస్ సూపరింటెండెంట్ అభినవ్ ధీమాన్ తెలిపారు.
అయితే.. ర్యాలీ జరిగిన రోజున తనను భగత్ సింగ్ చౌక్‌లో శాంతిభద్రతల విధుల్లో ఉంచారని బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. మధ్యాహ్నం 12:00 గంటలకు ఓటర్ అధికార్ ర్యాలీ ముగిసిన తరువాత రాహుల్ గాంధీ కారు ముందు కాలు జారి పడ్డానని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా.. ఈ సంఘటనపై బీజేపీ తీవ్రంగా విమర్శలు గుప్పించింది. బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనవాలా Xలో రాహుల్ గాంధీ వాహనం కింద కానిస్టేబుల్ పడ్డా వీడియోను షేర్ చేశారు. రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న కారు ఓ పోలీస్ కానిస్టేబుల్‌పై దూసుకెళ్లిందని ఆయన రాసుకొచ్చారు. ఆ తరువాత కానిస్టేబుల్ కుంటుతూ..కనిపించాడని ఆవేదన వ్యక్తం చేశారు. అతనికి తీవ్రంగా గాయాలైన, రాహుల్ ఒక రాజులగా.. కారులోనే ఉన్నారు కానీ.. చూడటానికి కిందకు కూడా దిగలేదని విమర్శించారు. అయితే రాహుల్ కారు కింద కానిస్టేబుల్ పడ్డా వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.