Kerala Cabinet Approves: క్రూర మృగాలను చంపొచ్చు
ABN , Publish Date - Sep 15 , 2025 | 06:09 AM
నివాస ప్రాంతంలోకి ప్రవేశించి ఒక వ్యక్తిపై దాడి చేసి గాయపరిచే ఏ క్రూర మృగాన్నైనా చంపేందుకు చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ ఆదేశించేలా అధికారం కల్పించేందుకుగాను వన్యప్రాణి సంరక్షణ చట్టం...
ముసాయిదా బిల్లుకు కేరళ క్యాబినెట్ ఆమోదం
తిరువనంతపురం, సెప్టెంబరు 14: నివాస ప్రాంతంలోకి ప్రవేశించి ఒక వ్యక్తిపై దాడి చేసి గాయపరిచే ఏ క్రూర మృగాన్నైనా చంపేందుకు చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ ఆదేశించేలా అధికారం కల్పించేందుకుగాను వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1972కు సవరణ చేసే ముసాయిదా బిల్లుకు కేరళ క్యాబినెట్ శనివారం ఆమోదం తెలిపింది. కేంద్ర చట్టానికి ఒక రాష్ట్ర ప్రభుత్వం సవరణ తీసుకువస్తుండటం దేశంలో ఇదే మొదటిసారి. ఈ మధ్యకాలంలో మనుషులపై జంతు దాడి ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకున్నారు. సోమవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ఈ ముసాయిదాపై చర్చ జరిగే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి..
అస్సాంలో 5.8 తీవ్రతతో భూకంపం.. బెంగాల్‌లోనూ ప్రకంపనలు
నేను శివ భక్తుడిని, నేను విషం అంతా మింగేస్తాను
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి