Ranya Rao: నటి రన్యారావుకు 102 కోట్ల జరిమానా
ABN , Publish Date - Sep 03 , 2025 | 03:24 AM
బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయిన కన్నడ నటి రన్యారావుకు డీఆర్‌ఐ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్..
బెంగళూరు, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయిన కన్నడ నటి రన్యారావుకు డీఆర్‌ఐ(డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) అధికారులు రూ.102 కోట్ల జరిమానా విధించారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న హోటల్ నిర్వాహకుడు తరుణ్ కొండరాజుకు రూ.63 కోట్లు, ఆభరణాల వ్యాపారులు సాహిల్ సకరియా, భరత్ కుమార్ జైన్‌లకు చెరో రూ.56 కోట్లు జరిమానా విధించారు. మంగళవారం బెంగళూరు సెంట్రల్ జైలుకు వచ్చిన డీఆర్‌ఐ అధికారులు ఈ మేరకు నలుగురు నిందితులకు ఒక్కొక్కరికి 250 పేజీల నోటీసులతోపాటు 2,500 పేజీల అనుబంధ పత్రాలను అందజేశారు. నలుగురికీ కలిపి వివరణాత్మక నోటీసులు, అనుబంధ పత్రాలు మొత్తం 11 వేల పేజీలు అందజేశామని డీఆర్‌ఐ వర్గాలు తెలిపాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
మణిపూర్‌లో పర్యటించనున్న ప్రధాని మోదీ..!
ఏపీ మహేష్ బ్యాంక్‌కు షాక్ ఇచ్చిన ఈడీ
For More National News And Telugu News