Waqf Bill: వక్ఫ్ సవరణల బిల్లుకు జేపీసీ ఆమోదం
ABN , Publish Date - Jan 27 , 2025 | 04:17 PM
వక్ఫ్ సవరణల బిల్లుపై భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీయే ప్రతిపాదించిన 14 సవరణలకు జేపీసీ ఆమోదం లభించగా, విపక్షాలు సూచించిన మార్పులు తిరస్కరణకు గురయ్యారు.

న్యూఢిల్లీ: వక్ఫ్ సవరణ బిల్లు (Waqf Amendment Bill) పరిశీలనకు ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (JPC) పలు సవరణలతో బిల్లుకు సోమవారంనాడు ఆమోదం తెలిపింది. భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీయే ప్రతిపాదించిన 14 సవరణలకు ఆమోదం లభించగా, విపక్షాలు సూచించిన మార్పులు తిరస్కరణకు గురయ్యారు. జేపీసీ సమావేశానంతరం కమిటీ చైర్మన్ జగదాంబికా పాల్ (Jagdambika Pal) ఆ వివరాలను వెల్లడించారు.
Delhi Election: డాక్టర్ అబేండ్కర్ సమ్మాన్ స్కాలర్‌షిప్ యోజన.. ఆప్ మేనిఫెస్టో హామీ
"మొత్తం 44 సవరణలు చర్చకు వచ్చాయి. సభ్యులందరిని సవరణలు సూచించాల్సిందిగా కోరాం. 6 నెలలపాటు సమగ్ర చర్చ జరిపాం. ఇదే మా చివరి సమావేశం. మెజారిటీ నిర్ణయం ప్రాతిపదికగా 14 సవరణలను కమిటీ ఆమోదించింది. విపక్షాలు సైతం సవరణలు సూచించాయి. ప్రతి సవరణను ఓటింగ్‌కు పెట్టాం. అయితే వారు సూచించిన సవరణలను సమర్ధిస్తూ 10 ఓట్లు, వ్యతిరేకిస్తూ 16 ఓట్లు వచ్చాయి'' అని జగదాంబిక పాల్ తెలిపారు.
విపక్షాలు అసంతృప్తి
కాగా, కమిటీలో ఎన్డీయే సూచించిన మార్పులకు ఆమోదం లభించడం, తాము సూచించిన మార్పులు తిరస్కరణకు గురికావడంపై ప్రతిపక్ష ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటింగ్ జరగలేదని అన్నారు. తమ వాదనలు వినలేదని, నియంతృత్వ ధోరణిలో జగదాంబికా పాల్ వ్యవహరించారని టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ ఆరోపించారు. ''మేము ఏదైతే ఊహించామో ఇవాళ అదే జరిగింది. మమ్మల్ని మాట్లాడేందుకు అనుమతించ లేదు. నిబంధలు, విధివిధానాలను పాటించలేదు. సవరణలపై క్లాజ్ బై క్లాజ్ చర్చించాలని మేము కోరినప్పటికీ మమ్మల్ని మాట్లాడనీయలేదు. ఇది ప్రజాస్వామ్యానికి దుర్దినం'' అని బెనర్జీ అన్నారు. అయితే బెనర్జీ ఆరోపణలను పాల్ తోసిపుచ్చారు. మొత్తం ప్రక్రియ అంతా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిందని, మెజారిటీ అభిప్రాయలను కమిటీ ఆమోదించిందని చెప్పారు. వక్ఫ్ చట్టం-1995లో పలు మార్పులు తీసుకు వస్తూ కేంద్రం గత ఆగస్టులో బిల్లు తీసుకువచ్చింది. అనంతరం బిల్లు పరిశీలనను 21 మంది సభ్యులతో కూడిన జేపీసీకి అప్పగించింది.
Sanatan Vedic Nation : సనాతన వైదిక దేశమే లక్ష్యం
India IST Now : ఇక నుంచి భారత్‌లో.. వన్ టైమ్.. వన్ నేషన్..
Saif Ali Attack Case: ఉద్యోగం, పెళ్లి రెండూ పోయాయి.. దాడి అనుమానితుడి ఆవేదన
Read More National News and Latest Telugu News