Jeep Wagoneer: స్వాతంత్ర్య వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా బ్లాక్ కారు.. దాని ప్రత్యేక ఏంటో తెలుసా?
ABN , Publish Date - Aug 15 , 2025 | 11:32 AM
Jeep Wagoneer: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఎర్రకోట వద్ద ఓ వింటేట్ కారు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అందరి దృష్టిని ఆకర్షించింది. అదే బ్లాక్ కలర్ జీప్ వేగనార్. ఈ కారు వెనుక చాలా పెద్ద చరిత్రే ఉంది. రెండు దేశాల మధ్య అనుబంధం దాగి ఉంది.
దేశ వ్యాప్తంగా 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ పతాకాన్ని ఎగవేశారు. ఈ సందర్భంగా ఓ వింటేట్ కారు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అందరి దృష్టిని ఆకర్షించింది. అదే బ్లాక్ కలర్ జీప్ వేగనార్. ఈ కారు వెనుక చాలా పెద్ద చరిత్రే ఉంది. రెండు దేశాల మధ్య అనుబంధం దాగి ఉంది. భూటాన్ రాజు 1965లో ఈ జీప్ వేగనార్‌ను అప్పటి భారత దేశ రాష్ట్ర పతి సర్వే పల్లి రాధాకృష్ణన్‌కు బహుమతిగా ఇచ్చారు.
2000 సంవత్సరంలో ఈ కారు అధికారికంగా ఇండియన్ ఆర్మీ వద్దకు చేరుకుంది. ఇక, అప్పటినుంచి ఢిల్లీలోని ఆర్మీ హెడ్ క్వాటర్స్‌లో కారు ఉంటోంది. స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా ప్రతీ ఏడాది జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఆఫ్ ది ఢిల్లీ ఏరియా ఈ కారులోనే ఎర్రకోటకు చేరుకుంటారు. కొత్త టెక్నాలజీ, సరి కొత్త మోడల్స్ కార్లు ఎన్నో అందుబాటులో ఉన్నా ఈ జీప్ వేగనార్ స్థానం మాత్రం దశాబ్ధాలుగా చెక్కు చెదరకుండా ఉంది. ఈ వింటేజ్ కారు చరిత్రకు, రెండు దేశాల బంధానికి నిదర్శనంగా నిలిచిపోయింది.
చరిత్ర సృష్టించిన బ్రాండ్
ఈ వేగనార్ కారు అమెరికాకు చెందిన జీప్ కంపెనీది. 1963లో వేగనార్ కార్ల ప్రొడక్షన్ మొదలైంది. దాదాపు 29 ఏళ్ల పాటు వేగనార్ కార్ల ఉత్పత్తి జరిగింది. వేగనార్ కార్లు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. అమెరికా ఆటోమొబైల్ చరిత్రలో ఈ కార్లకంటూ ఓ చరిత్ర ఉంది. బాడీ డిజైన్‌లో ఎలాంటి మార్పులు చేయకుండా ఎక్కువ కాలం ఉత్పత్తి చేయబడిన ఎస్‌యూవీలు వేగనార్ కార్లే కావటం విశేషం. 1991లో వీటి ఉత్పత్తి నిలిచిపోయింది. అయితే, 2021లో మోడ్రన్ వర్షన్ వేగనార్ కార్లు అందుబాటులోకి వచ్చాయి.
ఇవి కూడా చదవండి
బనకచర్ల ప్రాజెక్ట్ పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు