Share News

Pahalgam Attack Victims: పహల్గామ్ ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం ప్రకటన..

ABN , Publish Date - Apr 23 , 2025 | 12:02 PM

జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. దీంతోపాటు తీవ్రంగా గాయపడిన వారికి సహాయాన్ని అందిస్తామని తెలిపింది. అయితే కేంద్రం కూడా దీనిపై పరిహారం ప్రకటించే ఛాన్సుంది.

Pahalgam Attack Victims: పహల్గామ్ ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం ప్రకటన..
Jammu Government Announces Aid

పహల్గామ్ కొండల్లో నిశ్శబ్దాన్ని చీల్చిన ఉగ్రవాద దాడి అనేక మందిని కలచివేసింది. అమాయక ప్రాణాలు ఊహించని విధంగా పోవడం, వారి కుటుంబాల్లో శోకసంద్రం నెలకొంది. ఈ విషాద సమయంలో జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం బాధిత కుటుంబాల పట్ల తన బాధ్యతను చాటుకుంది. మరణించిన వారి కుటుంబాలకు రూ. 10 లక్షల ఆర్థిక సహాయం, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 2 లక్షల సహాయం, స్వల్పంగా గాయపడిన వారికి రూ.1 లక్ష చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఈ సహాయం వారి గాయాల్ని పూర్తిగా నయం చేయకపోయినా, బాధిత కుటుంబాలకు కొంత భరోస అందించే ప్రయత్నమని చెప్పవచ్చు.


బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం..

ముఖ్యమంత్రి కార్యాలయం అధికారికంగా ఎక్స్ లో పోస్ట్ చేసి ఈ మేరకు ప్రకటించింది. నిర్దోష పౌరులపై చేసిన ఈ హింసాత్మక, అమానుష చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ఘటన మానవతకు పూర్తి విరుద్ధమైనది". మేం విలువైన ప్రాణాలను కోల్పోయాం. ఆ బాధను ఏ ఆస్తి కూడా భర్తీ చేయలేదు. కానీ బాధిత కుటుంబాలకు అండగా ఉండేందుకు ఈ ఆర్థిక సహాయాన్ని ప్రకటిస్తున్నామని సీఎంఓ తెలిపింది. అంతేగాక, మృతదేహాల్ని సగౌరవంగా వారి స్వగ్రామాలకు తరలించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.


కేంద్రం కూడా..

గాయపడినవారికి అత్యుత్తమ వైద్యం అందిస్తున్నామని చెప్పింది. ఈ విషాద సమయంలో బాధిత కుటుంబాలకు అండగా ఉంటామంది. దీంతోపాటు ఈ క్రూర చర్యకు పాల్పడిన వారిని శిక్షించేందుకు కృషి చేస్తామని స్పష్టం చేసింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు సహాయం ప్రకటించే అవకాశం ఉంది. ఈ ఆర్థిక సహాయం బాధితులకు కొంత ఊరటనిచ్చేలా ఉన్నప్పటికీ రాష్ట్రంలో శాంతి, న్యాయం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని అధికారులు తెలిపారు. ఇదే సమయంలో కేంద్రం కూడా భరోసా కల్పిస్తే బాధిత కుటుంబాలకు మరింత ఊరట లభించనుంది.


ఇవి కూడా చదవండి:

Pahalgam Attack: పహల్గామ్ ఉగ్రవాద దాడి.. భారత్‌కు మద్దతుగా ప్రపంచ నేతల సంఘీభావం

Pahalgam Terror Attack: హృదయాన్ని కదిలించే విషాదం..పహల్గామ్ ఉగ్రదాడిలో అర్ధాంతరంగా ఆగిన జీవితం


PM Modi: విమానాశ్రయంలో దిగిన వెంటనే.. అజిత్ దోవల్, జైశంకర్‌తో మోడీ అత్యవసర భేటీ

PM Modi: ప్రధాని మోదీ సౌదీ టూర్ రద్దు..ఇండియాకు వచ్చేసిన పీఎం


TRAI: సిగ్నల్, నెట్ లేకపోతే సైలెంట్ కాదు..ఫిర్యాదు చేయడం మరింత ఈజీ తెలుసా..


Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 23 , 2025 | 12:21 PM