Swarn Prasadam: ఈ స్వీట్ కిలో రూ. 1.11 లక్షలు
ABN , Publish Date - Oct 17 , 2025 | 01:16 PM
రాజస్థాన్ రాజధాని జైపూర్‌కు చెందిన మిఠాయి వ్యాపారి అంజలి జైన్ స్వర్ణ ప్రసాదం పేరిట అత్యంత ఖరీదైన స్వీట్‌ను రూపొందించారు.
పండగల వేళ.. ముఖ్యంగా దసరా, దీపావళి వేళ.. తమ సంస్థ ఉద్యోగులకు స్వీట్లు అందజేస్తాయి యాజమాన్యం. దేశవ్యాప్తంగా దాదాపుగా అన్ని సంస్థలు ఈ విధంగా వ్యవహరిస్తున్నాయి. దీంతో దీపావళీకి మిఠాయి షాపుల్లో స్వీట్స్‌కు భారీగా డిమాండ్ ఏర్పడింది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో మిఠాయి దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి.
అలాంటి వేళ.. దీపావళి వేడుకల ప్రారంభమవుతున్న సమయంలో రాజస్థాన్ రాజధాని జైపూర్‌కు చెందిన మిఠాయి వ్యాపారి అంజలి జైన్ స్వర్ణ ప్రసాదం పేరిట అత్యంత ఖరీదైన స్వీట్‌ను రూపొందించారు. దీని ధర కిలో రూ. 1.11 లక్షలుగా నిర్ణయించారు.
ఈ స్వర్ణ ప్రసాదం తయారీలో కుంకుమ పువ్వు, పైన్ గింజలతోపాటు స్వర్ణ భస్మాన్ని వినియోగించారు. అలాగే స్వచ్ఛమైన బంగారంతో పూత పోసిన ఆభరణాల తరహా పెట్టెల్లో ఈ స్వీట్లను ప్యాక్ చేస్తారు. అదీకాక కుంకుమ పువ్వు, స్వర్ణ భస్మం అత్యంత ఖరీదైన వస్తువులు. ఇవి సామాన్యంగా ప్రతి చోట లభ్యం కావు. నాణ్యమైనవి కావాలంటే.. భారీగా నగదు వెచ్చించి కొనుగోలు చేయాలి. ఆ క్రమంలో ఈ స్వీట్ ధరను రూ. లక్షకు పైగా నిర్ణయించి విక్రయిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ముచ్చటగా ఈ మూడు పనులు చేస్తే..
ధన త్రయోదశికి బంగారం కొనలేకున్నా.. లక్ష్మీ అనుగ్రహం కలగాలంటే..
Read Latest National News and Telugu News