Tax Evasion Donations: గుర్తింపులేని రాజకీయ పార్టీలకు విరాళాల పేరిట పన్ను ఎగవేతలు
ABN , Publish Date - May 06 , 2025 | 04:20 AM
ఐటీ శాఖ రిజిస్టర్ అయి ఉండి గుర్తింపు లేని రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చిన 63వేల మంది దాతలపై రూ.1,400 కోట్ల పన్ను వసూలు చేసింది. ఈ విరాళాలు పన్ను ఎగవేతలకు ఉపయోగపడుతున్నట్లు గుర్తించారు
దాతలపై ఐటీ శాఖ కొరడా.. రూ.1,400 కోట్ల పన్ను వసూలు
న్యూఢిల్లీ, మే 5: రిజిస్టర్ అయి ఉండి గుర్తింపులేని రాజకీయ పార్టీలకు (ఆర్‌యూపీపీలు) విరాళాలు ఇస్తూ భారీగా పన్ను ఎగవేతలకు పాల్పడిన దాతలపై ఐటీ శాఖ కొరడా ఝళిపిస్తోంది. 2022 నుంచి 2024 వరకు ఇలా విరాళాలిచ్చిన 63వేల మంది దాతల నుంచి రూ.1,400 కోట్లను రికవరీ చేసింది. అసెంబ్లీ లేదా లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్ర లేదా జాతీయ పార్టీలుగా అర్హత కలిగి ఉండటానికి అవసరమైన ఓట్ల శాతాన్ని పొందలేని పార్టీలను ఆర్‌యూపీపీలుగా వ్యవహరిస్తారు. దాతల నుంచి విరాళాలు పొందే ఆర్‌యూపీపీలతోపాటు రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చే దాతలకు పన్ను మినహాయింపులు కల్పిస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని దాతలు పన్ను ఎగవేతలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. 2022-2023, 2023-2024లో 3,264కు పైగా ఆర్‌యూపీపీలు రూ.10వేల కోట్లకుగాపైగా ఎన్నికల విరాళాల అందుకున్నట్టు తెలుస్తోంది.
Read Also: Rahul meets PM Modi : ప్రధాని నరేంద్ర మోదీతో రాహుల్ గాంధీ భేటీ
Sonu Nigam: పహల్గాం ఘటనపై సోనూ నిగమ్ సంచలన కామెంట్స్.. షాకిచ్చిన పోలీసులు..
India vs Pakistan Missile Power: భారత్‌తో పోలిస్తే పాక్ క్షిపణుల సామర్థ్యం ఎంతంటే..