Air Drop Test: ఎయిర్ డ్రాప్ పరీక్ష విజయవంతం
ABN , Publish Date - Aug 25 , 2025 | 02:45 AM
గగన్‌యాన్ మిషన్‌లో మరో ముందడుగు పడింది. ఈ మిషన్‌లో కీలకమైన క్రూ మాడ్యూల్‌కు సంబంధించిన తొలి ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్....
గగన్‌యాన్ మిషన్‌లో మరో ముందడుగు
సూళ్లూరుపేట, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): గగన్‌యాన్ మిషన్‌లో మరో ముందడుగు పడింది. ఈ మిషన్‌లో కీలకమైన క్రూ మాడ్యూల్‌కు సంబంధించిన తొలి ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్(ఐఏడీటీ-01)ను ఇస్రో విజయవంతంగా నిర్వహించింది. ప్రయోగంలో భాగంగా గగన్‌యాన్ క్రూ మాడ్యూల్ నమూనాను షార్ నుంచి 35 కిలోమీటర్ల దూరంలో.. భూ ఉపరితలానికి 3 కిలోమీటర్ల ఎత్తులో హెలికాప్టర్ సాయంతో నింగిలోకి తీసుకెళ్లి కిందకు జారవిడిచారు. పారాచూట్ల సాయంతో ఆ మాడ్యూల్ వేగాన్ని తగ్గించుకుంటూ సముద్ర జలాల్లో సురక్షితంగా దిగేలా చేశారు. అనంతరం బంగాళాఖాతంలో పడిన క్రూ మాడ్యూల్‌ను స్వాధీనం చేసుకుని చెన్నై పోర్టుకు తరలించారు. వ్యోమగాములను అంతరిక్షం నుంచి తీసుకొచ్చేందుకు ఈ మాడ్యూల్ ఉపయోగపడుతుంది. మరోవైపు, మానవసహిత అంతరిక్ష మిషన్ల కోసం వ్యోమగాములను సిద్ధం చేసుకోవాలని ఇస్రో భావిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా వ్యోమగాముల బృందాన్ని ఏర్పాటు చేయాల ని, ఇందులో మహిళలు, సాధారణ ప్రజలను కూడా భాగస్వాములను చేయాలని నిర్ణయించింది.
ఇవి కూడా చదవండి..
మరాఠా రిజర్వేషన్‌పై ఆఖరి పోరాటం.. మనోజ్ జారంగే పిలుపు
రాహుల్ ఓటర్ అధికార్ యాత్రలో జోష్.. హాజరుకానున్న ప్రియాంక
For More National News And Telugu News