TikTok Making a Comeback in India: భారత్‌లోకి మళ్లీ టిక్‌టాక్
ABN , Publish Date - Aug 23 , 2025 | 03:13 AM
ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్ సేవలు మళ్లీ భారత్‌లో అమల్లోకి రాబోతున్నాయంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది...
న్యూఢిల్లీ, ఆగస్టు 22: ప్రముఖ షార్ట్ వీడియో యాప్ ‘టిక్‌టాక్’ సేవలు మళ్లీ భారత్‌లో అమల్లోకి రాబోతున్నాయంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇందుకు కారణం ఐదేళ్లుగా కనిపించని టిక్‌టాక్ వెబ్‌సైట్ భారత్‌లో మొదటిసారి అనేక మందికి ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రావడమే.. ఈ విషయాన్ని కొందరు సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో పలు ఊహాగానాలకు దారితీసింది. ఏదేమైనా ప్లే స్టోర్‌లో ఇప్పటివరకు ఈ యాప్ అందుబాటులోకి రాలేదు. అలాగే టిక్‌టాక్ సేవలను భారత్‌లో తిరిగి ప్రారంభించే విషయమై మాతృసంస్థ బైట్‌డ్యాన్స్ కంపెనీ కూడా ఏ ప్రకటన చేయలేదు. 2020 జూన్‌లో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రతా పరమైన కారణాలతో టిక్‌టాక్‌తో పాటు చైనాకు చెందిన 58 యాప్‌లపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
చట్టంగా మారిన ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు
వెబ్ సిరిస్‌లో మోదీ మాజీ బాడీగార్డ్
For More National News And Telugu News