Hero Vijay: హీరో విజయ్ నివాసంలో ఆగంతకుడి చొరబాటు
ABN , Publish Date - Sep 20 , 2025 | 10:34 AM
తమిళ ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ నివాసంలో గుర్తు తెలియని అగంతకుడు చొరబడ్డాడు. శుక్రవారం జరిగిన ఈ సంఘటన తీవ్ర కలకలం సృష్టించింది. కట్టుదిట్టమైన ‘వై’ కేటగిరీ భద్రత కలిగిన విజయ్ నివాసంలో ఆ అగంతకుడు ఎలా ప్రవేశించాడన్న దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
- వై కేటగిరీ భద్రతా వైఫల్యమా?
చెన్నై: తమిళ ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్(Vijay) నివాసంలో గుర్తు తెలియని అగంతకుడు చొరబడ్డాడు. శుక్రవారం జరిగిన ఈ సంఘటన తీవ్ర కలకలం సృష్టించింది. కట్టుదిట్టమైన ‘వై’ కేటగిరీ భద్రత కలిగిన విజయ్ నివాసంలో ఆ అగంతకుడు ఎలా ప్రవేశించాడన్న దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. చెన్నై(Chennai) నగర శివారు ప్రాంతమైన ఈసీఆర్ రోడ్డు నీలాంకరైలోని విజయ్ నివాసం టెర్ర్‌సపై అగంతకుడు దాక్కున్నాడు.
గురువారం పగలంతా టెర్ర్‌సపైనే ఆహారం లేకుండా గడిపాడు. శుక్రవారం ఉదయం విజయ్ మార్నింగ్ వాక్ కోసం టెర్ర్‌సపైకి వెళ్ళగా, ఆ అగంతకుడు పరుగున వచ్చి హగ్ చేసుకోవడంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన విజయ్.. ఆ తర్వాత తేరుకుని, ఆ అగంతకుడితో మాట్లాడి, కిందికి తీసుకొచ్చి భద్రతా సిబ్బదికి అప్పగించారు. ఆ తర్వాత నీలాంకరై పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. విజయ్‌కు ‘వై’ కేటగిరీ భద్రత ఉన్నప్పటికీ ఆయన ఇంటి టెర్ర్‌సపైకి అగంతకుడు ఎలా చేరాడన్నదే ఎవరికీ అంతుచిక్కడం లేదు.

మరోవైపు, ఆ అగంతకుడు ఏదేని పేలుడు పదార్థాలను అమర్చాడా? అనే విషయంపై బాంబు స్క్వాడ్ విజయ్ ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేయగా, అలాంటివేమీ కనిపించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అలాగే, ఆ అగంతకుడిని నీలాంకరై పోలీసులు విచారించి, ఆ తర్వాత కీల్పాక్కంలోని ప్రభుత్వ మానసిక చికిత్రా కేంద్రానికి తరలించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
అదంతా ఫేక్.. ఆ వార్తలను ఖండిస్తున్నా
Read Latest Telangana News and National News