Share News

Indian Navy: శత్రు జలాంతర్గాముల ఉనికిని పసిగట్టే ఆండ్రోత్‌

ABN , Publish Date - Sep 15 , 2025 | 06:12 AM

భారత నౌకాదళంలోకి మరో స్వదేశీ యుద్ధనౌక వచ్చి చేరింది. జలాంతర్గాముల ఉనికిని పసిగట్టే యాంటీ సబ్‌మెరైన్‌ వార్‌షిప్‌ ‘ఆండ్రోత్‌’ శనివారం భారత నావికాదళంలో...

Indian Navy: శత్రు జలాంతర్గాముల ఉనికిని పసిగట్టే ఆండ్రోత్‌

న్యూఢిల్లీ, సెప్టెంబరు 14: భారత నౌకాదళంలోకి మరో స్వదేశీ యుద్ధనౌక వచ్చి చేరింది. జలాంతర్గాముల ఉనికిని పసిగట్టే యాంటీ సబ్‌మెరైన్‌ వార్‌షిప్‌ ‘ఆండ్రోత్‌’ శనివారం భారత నావికాదళంలో అడుగుపెట్టింది. కోల్‌కతాలోని గార్డెన్‌ రీచ్‌ షిప్‌ బిల్డర్స్‌, ఇంజనీర్స్‌ (జీఆర్‌ఎ్‌సఈ) దీన్ని స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించింది. ఈ సంస్థ నిర్మిస్తున్న 8యాంటీ సబ్‌మెరైన్‌ వార్‌ఫేర్‌ షాలో వాటర్‌ క్రాఫ్ట్స్‌ (ఏఎ్‌సడబ్ల్యూ ఎస్‌డబ్ల్యూసీఎస్‌) శ్రేణి నౌకల్లో ఇది రెండోది. దీనికంటే ముందు నిర్మించిన ఐఎన్‌ఎస్‌ ఆర్నాలా ఈ ఏడాది జూన్‌ 18న నేవీలోకి చేరింది. తాజాగా విధుల్లోకి చేరిన యుద్ధనౌకకు లక్ష దీవుల్లోని ‘ఆండ్రోత్‌’ అనే దీవి పేరు పెట్టారు. దీని పొడవు దాదాపు 77 మీటర్లు. దీనిలో అత్యాధునిక తేలికపాటి టోర్పిడోలు, జలాంతర్గామి విధ్వంసక రాకెట్లు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి..

అస్సాంలో 5.8 తీవ్రతతో భూకంపం.. బెంగాల్‌లోనూ ప్రకంపనలు

నేను శివ భక్తుడిని, నేను విషం అంతా మింగేస్తాను

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 15 , 2025 | 06:13 AM