Share News

Laser Weapon: సైనిక శక్తి బలోపేతానికి మెగా డిఫెన్స్‌ ప్లాన్‌

ABN , Publish Date - Sep 06 , 2025 | 04:23 AM

పహల్గాంలో ఉగ్రదాడి అనంతరం ఆపరేషన్‌ సిందూర్‌తో గట్టిగా బదులిచ్చిన భారత్‌.. ఇప్పుడు తన..

Laser Weapon: సైనిక శక్తి బలోపేతానికి మెగా డిఫెన్స్‌ ప్లాన్‌

  • అణుశక్తి యుద్ధనౌకలు, లేజర్‌ ఆయుధాలు

  • సాయుధ దళాలకు హైపర్‌ సానిక్‌ క్షిపణులు

  • 15 ఏళ్లకు రోడ్‌ మ్యాప్‌ సిద్ధం

న్యూఢిల్లీ, సెప్టెంబరు 5: పహల్గాంలో ఉగ్రదాడి అనంతరం ఆపరేషన్‌ సిందూర్‌తో గట్టిగా బదులిచ్చిన భారత్‌.. ఇప్పుడు తన సైనిక శక్తిని మరింత బలోపేతం చేసుకోవడంపై దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా అణుశక్తితో నడిచే యుద్ధ నౌకలు, నెక్ట్స్‌ జనరేషన్‌ యుద్ధ ట్యాంకులు, హైపర్‌ సానిక్‌ క్షిపణులు, లేజర్‌, ఏఐ ఆధారిత ఆయుధాలు,

స్టెల్త్‌ బాంబర్‌ డ్రోన్‌లు వంటి అత్యాధునిక ఆయుధాలను సైనిక దళాలకు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక రచించింది. వచ్చే 15 ఏళ్లలో ఈ లక్ష్యాన్ని పూర్తిచేసేలా రక్షణ మంత్రిత్వ శాఖ ఒక రోడ్‌మ్యా్‌పను సిద్ధం చేసింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారత్‌ చేపట్టిన అతిపెద్ద డిఫెన్స్‌ అప్‌గ్రేడ్‌ ప్లాన్‌ ఇదే కావడం విశేషం. ఈ రోడ్‌మ్యాప్‌ ప్రకారం పాత టీ-72 యుద్ధ ట్యాంకులను 1,800 ఫ్యూచర్‌ ట్యాంకులతో భర్తీ చేయనున్నారు. వీటితోపాటు మరో 400 తేలికపాటి యుద్ధ ట్యాంకులను కూడా సైన్యానికి అందిస్తారు. యుద్ధట్యాంకులపై నుంచి ప్రయోగించే 50,000 యాంటీ ట్యాంక్‌ గైడెడ్‌ మిస్సైల్స్‌, 700 రోబోటిక్‌ కౌంటర్‌ ఐఈడీ వ్యవస్థలను అందించనుంది. వీటితోపాటు 6 లక్షల శతఘ్ని గుండ్లు, మానవ రహిత విమానాలను కూడా సైన్యానికి అందించనున్నారు.

నేవీ కోసం తర్వాతి తరం యుద్ధ నౌకలు

నౌకాదళం కోసం సరికొత్త విమానవాహక యుద్ధనౌక, పది తర్వాతి తరం యుద్ధ నౌకలు, ఏడు అధునాతన కార్వెట్‌లు, నాలుగు ల్యాండింగ్‌ డాక్‌ ప్లాట్‌ఫారమ్‌లు సమకూర్చనున్నారు. వీటితోపాటు అణుశక్తితో నడిచే యుద్ధ నౌకలు, ఎలకో్ట్ర మాగ్నెట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ లాంచ్‌ సిస్టమ్‌ కూడా అందించనున్నారు. ఇక భారత వైమానిక దళం కోసం 75 హై ఆల్టిట్యూడ్‌ సూడో శాటిలైట్స్‌, 150 స్టెల్త్‌ బాంబర్‌ డ్రోన్లు, రిమోట్‌ సాయంతో పనిచేసే 100 విమానాలు, గైడెడ్‌ ఆయుధాలను అందిస్తారు. ఇవి కాకుండా యాంటీ స్వార్మ్‌ డ్రోన్‌ వ్యవస్థలు, లేజర్‌ ఆయుధాలు, ఏఐతో పనిచేసే ఆయుధాలు, మానవరహి విమానాల కోసం గగనతలం నుంచి భూమిపై ఉన్న లక్ష్యాలపైకి ప్రయోగించే క్షిపణు, అత్యాధునిక టార్గెటింగ్‌ ప్యాడ్స్‌ కూడా సమకూర్చనున్నారు.


ఇవి కూడా చదవండి

భారత్‌లో తొలి టెస్లా కారు డెలివరీ.. కస్టమర్ ఎవరంటే..

భారత్‌ను ముక్కలు చేయాలంటూ పోస్టు.. ఆస్ట్రియా ఆర్థికవేత్త ఎక్స్ అకౌంట్‌పై నిషేధం

For More National News and Telugu News

Updated Date - Sep 06 , 2025 | 04:23 AM