Share News

Donald Trump Tariffs: ట్రంప్‌తో పంచాయితీ తెగకుంటే వచ్చే ఆర్థిక సంవత్సరం కష్టమే

ABN , Publish Date - Sep 09 , 2025 | 03:16 AM

ట్రంప్‌ టారిఫ్‌ల మోత కారణంగా భారత్‌ వృద్ధిరేటులో 0.5% నుంచి 0.6% వరకు కోత పడవచ్చని భారత ముఖ్య ఆర్థిక...

Donald Trump Tariffs: ట్రంప్‌తో పంచాయితీ తెగకుంటే వచ్చే ఆర్థిక సంవత్సరం కష్టమే

  • కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్‌

న్యూఢిల్లీ, సెప్టెంబరు 8: ట్రంప్‌ టారి్‌ఫల మోత కారణంగా భారత్‌ వృద్ధిరేటులో 0.5ు నుంచి 0.6ు వరకు కోత పడవచ్చని భారత ముఖ్య ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్‌ అన్నారు. బ్లూమ్‌బెర్గ్‌ టీవీ చానెల్‌కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. రష్యా చమురు కొనుగోలు కారణంగా భారత్‌ మీద అదనంగా వేసిన ప్రతీకార ట్యారి్‌ఫల వ్యవహారం కొంతకాలమే ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ట్యారి్‌ఫల అనిశ్చితి వచ్చే ఆర్థిక సంవత్సరానికి కూడా కొనసాగితే మాత్రం ప్రభావం తీవ్రంగా ఉంటుందని, భారత్‌కు ముప్పు తప్పదని హెచ్చరించారు. 2026 మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరానికి భారత ప్రభుత్వం 6.3 నుంచి 6.8 శాతం వృద్ధిరేటును ఆశిస్తోంది. మొదటి మూడు నెలల వృద్ధిరేటు భారీగా 7.8 శాతం నమోదైన నేపథ్యంలో భారత్‌ భారీ అంచనాల్లో ఉంది. జీఎస్టీ సంస్కరణలతో పన్నురేట్లు భారీగా తగ్గడం, ద్రవ్యోల్బణం బాగా తగ్గిపోవడం ఆర్థిక వ్యవస్థల మీద ఆశలు రేకెత్తిస్తున్నాయని నాగేశ్వరన్‌ చెప్పారు.


ఇవి కూడా చదవండి..

ఉప రాష్ట్రపతి ఎన్నికలో తొలి ఓటు వేసేది ఎవరంటే..

రేపే ఉపరాష్ట్రపతి ఎన్నిక

For More National News And Telugu News

Updated Date - Sep 09 , 2025 | 09:24 AM