రైలు బయలుదేరేందుకు 8 గంటల ముందే రిజర్వేషన్ చార్టు
ABN , Publish Date - Jun 30 , 2025 | 05:16 AM
టిక్కెట్ల రిజర్వేషన్ విధానంలో మరో మార్పు చేసినట్టు ఆదివారం రైల్వే శాఖ ప్రకటించింది. ఇంతవరకు రైలు బయలుదేరడానికి కేవలం నాలుగు గంటల ముందు రిజర్వేషన్ ఛార్టును...
న్యూఢిల్లీ, జూన్ 29: టిక్కెట్ల రిజర్వేషన్ విధానంలో మరో మార్పు చేసినట్టు ఆదివారం రైల్వే శాఖ ప్రకటించింది. ఇంతవరకు రైలు బయలుదేరడానికి కేవలం నాలుగు గంటల ముందు రిజర్వేషన్ ఛార్టును ఖరారు చేస్తుండగా, ఇక నుంచి ఎనిమిది గంటల ముందు ఛార్టును ప్రకటించనుంది. ఇది మంగళవారం నుంచి అమల్లోకి రానుంది. రైలు బయలుదేరడానికి కేవలం 4 గంటల ముందు రిజర్వేషన్ ఛార్టును ఖరారు చేస్తుండడంతో టిక్కెట్లు కన్ఫర్మ్ అవుతుందో లేదో తెలియక వెయింటింగ్ లిస్టులో ఉన్న ప్రయాణికులు ఇబ్బందిపడుతున్నారు. ప్రయాణాన్ని కొనసాగించాలో, ప్రత్నామ్నాయం చూసుకోవాలో నిర్ణయించుకోలేక అవస్థలు పడుతున్నారు. అందువల్ల టిక్కెట్ కన్ఫర్మ్ అవుతుందో లేదో అన్న విషయంపై స్పష్టత ఇచ్చేందుకు రైలు బయలుదేరడానికి 8గంటల ముందు రిజర్వేషన్ల ఛార్టును తయారు చేయనున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. వెయిటింగ్ లిస్టుపై ఉన్న ప్రస్తుతం ఉన్న 25ు పరిమితిని పెంచుతూ ఆదేశాలు ఇచ్చింది. తత్కాల్ టిక్కెట్ల బుకింగ్‌కు ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ తీసుకున్న నిర్ణయం కూడా జులై ఒకటో తేదీ నుంచే అమల్లోకి రానుండడం గమనార్హం.
Also Read:
యువ రచయిత సూరాడ ప్రసాద్‌కు సీఎం చంద్రబాబు అభినందనలు..
నా శత్రువు పెద్దారెడ్డి మాత్రమే...
For More Telugu News