Share News

India US Trade Talks: భారత్‌ అమెరికా మధ్య నేడు వాణిజ్య చర్చలు

ABN , Publish Date - Sep 16 , 2025 | 06:23 AM

భారత్‌-అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందంపై మంగళవారం ఆరో విడత చర్చలు జరగనున్నాయి. చర్చల్లో పాల్గొనేందుకు అమెరికా వాణిజ్య ప్రతినిధి బ్రెండన్‌...

India US Trade Talks: భారత్‌ అమెరికా మధ్య నేడు వాణిజ్య చర్చలు

వాషింగ్టన్‌, సెప్టెంబరు 15: భారత్‌-అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందంపై మంగళవారం ఆరో విడత చర్చలు జరగనున్నాయి. చర్చల్లో పాల్గొనేందుకు అమెరికా వాణిజ్య ప్రతినిధి బ్రెండన్‌ లించ్‌ భారత్‌కు రానున్నారు. భారత ప్రతినిధిగా వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్‌ అగర్వాల్‌ చర్చల్లో పాల్గొంటారు. మరోవైపు, వాణిజ్య ఒప్పందంపై భారత్‌ను చర్చలకు వచ్చేలా చేశామని ట్రంప్‌ వాణిజ్య సలహాదారు పీటర్‌ నవారో వ్యాఖ్యానించారు. అదే సమయంలో ఆయన మరోసారి భారత ఆర్ధిక విధానాలను విమర్శించారు. ఓ పక్క అమెరికాతో అన్యాయమైన వ్యాపారం ద్వారా డబ్బులు సంపాదించుకుంటూ చౌకగా రష్యా చమురు కొంటున్నారని ఆరోపించారు. భారత్‌ ఇచ్చే డబ్బులతో రష్యా ఆయుధాలు కొని ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తోందన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

మహిళలకు రాజకీయ అవకాశాలతోనే అభివృద్ధి సాధ్యం: గవర్నర్ అబ్దుల్ నజీర్

భూముల ఆక్రమణకు చెక్.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

For AP News And Telugu News

Updated Date - Sep 16 , 2025 | 06:23 AM