India US Trade Talks: ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై నేడు భారత్ అమెరికా చర్చలు
ABN , Publish Date - Sep 22 , 2025 | 06:30 AM
భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై సోమవారం వాషింగ్టన్‌లో చర్చలు జరుగుతున్నాయి. భారత్ తరఫున వాణిజ్య మంత్రి గోయల్ ఆధ్వర్యంలోని ప్రతినిఽధి బృందం ప్రాతినిధ్యం...
వాషింగ్టన్‌కు వాణిజ్య మంత్రి పియూష్ గోయల్
న్యూఢిల్లీ, సెప్టెంబరు 21: భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై సోమవారం వాషింగ్టన్‌లో చర్చలు జరుగుతున్నాయి. భారత్ తరఫున వాణిజ్య మంత్రి గోయల్ ఆధ్వర్యంలోని ప్రతినిఽధి బృందం ప్రాతినిధ్యం వహించనుంది. భారత్-అమెరికాల మధ్య ఇప్పటికే ఉన్న పలు సమస్యలతో పాటు తాజాగా హెచ్-1బీ వీసాలపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఈ చర్చలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఇరుదేశాల మధ్య చర్చలు సజావుగా సాగుతున్నాయని గోయల్ అభిప్రాయపడ్డారు. సానుకూల ఫలితాలు రావాలని ఇరు దేశాలు ఆకాంక్షిస్తున్నాయని చెప్పారు. ‘‘సంప్రదింపులు కొసాగుతున్నాయి. దీనిని ఓ సందర్భంగా భావిస్తున్నామే తప్ప, ఘర్షణగా పరిగణించడం లేదు’’ అని తెలిపారు. ఈ నెల 16న అమెరికా వాణిజ్య ప్రతినిధులు ఢిల్లీ వచ్చి చర్చలు జరిపారు. మరింత లోతుగా చర్చలు జరిపి విభేదాలు పరిష్కరించుకోవాలని ఆ సందర్భంగా నిర్ణయించడంతో తాజాగా భారత ప్రతినిఽధి బృందం అమెరికాలో చర్చలు జరపనుంది. గతంలో అమెరికా నుంచి వ్యవసాయ, పాల ఉత్పత్తులను దిగుమతి చేసుకోబోమంటూ భారత్ కఠిన వైఖరి ప్రదర్శించగా ప్రస్తుతం కాస్త మెత్తపడే అవకాశం ఉన్ననట్టు కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి..
జీఎస్టీ సంస్కరణలతో ఆత్మనిర్భరత... శరవేగంగా వృద్ధి
దేశ ప్రజలకు ప్రధాని గుడ్ న్యూస్.. ఇక జీఎస్టీ ఉత్సవ్ ప్రారంభం
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి