Air Defence System: అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ పరీక్ష సక్సెస్
ABN , Publish Date - Aug 25 , 2025 | 02:41 AM
భారత రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసే దిశగా మరో కీలక ముందడుగు పడింది. డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన అత్యాధునిక సమీకృత గగనతల రక్షణ ఆయుధ వ్యవస్థ..
డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన ఐఏడీడబ్ల్యూఎస్
న్యూఢిల్లీ, ఆగస్టు 24: భారత రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసే దిశగా మరో కీలక ముందడుగు పడింది. డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన అత్యాధునిక సమీకృత గగనతల రక్షణ ఆయుధ వ్యవస్థ (ఐఏడీడబ్ల్యూఎ్‌స)ను భారత్ విజయంతంగా పరీక్షించింది. శనివారం అర్ధరాత్రి 12:30 గంటలకు ఒడిశా తీరంలోని దీన్ని పరీక్షించినట్టు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ‘ఐఏడీడబ్ల్యూఎస్ (ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్) అనేది డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన బహుళ అంచెల గగనతల రక్షణ వ్యవస్థ. దీనిలో స్వదేశీయంగా అభివృద్ధి చేసిన క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ (క్యూఆర్‌ఎ్‌సఏఎం), అడ్వాన్స్‌డ్ వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ (వీఎ్‌సహెచ్‌వోఆర్‌ఏడీఎస్) మిస్సైల్స్, హైపవర్ లేజర్-బేస్డ్ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ (డీఈడబ్ల్యూ) ఉన్నాయి’ అని రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా, సముద్ర తీరప్రాంత గస్తీని బలోపేతం చేసుకోవడంపై భారత నేవీ దృష్టి పెట్టింది. దీనికోసం 76 నావల్ యుటిలిటీ హెలికాప్టర్లు (ఎన్‌హెచ్‌యూ) కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ‘సమాచారం కోసం అభ్యర్థన’ (రిక్వెస్ట్ ఫర్ ఇన్షర్మేషన్)ను జారీ చేసింది. నేవీ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచిన వివరాల ప్రకారం ఈ 76 హెలికాప్టర్లలో 51 నావికా దళానికి, మిగిలిన 25 హెలికాప్టర్లను కోస్ట్‌గార్డ్‌కు కేటాయించనున్నారు.
ఇవి కూడా చదవండి..
మరాఠా రిజర్వేషన్‌పై ఆఖరి పోరాటం.. మనోజ్ జారంగే పిలుపు
రాహుల్ ఓటర్ అధికార్ యాత్రలో జోష్.. హాజరుకానున్న ప్రియాంక
For More National News And Telugu News