Share News

Tejas Fighter Jets: వాయుసేన శక్తికి మరింత తేజస్‌

ABN , Publish Date - Sep 26 , 2025 | 06:05 AM

మన వాయుసేన నుంచి మిగ్‌-21 యుద్ధ విమానాలకు వీడ్కోలు పలుకుతున్న వేళ దేశీయ యుద్ధ విమాన కొనుగోళ్ల కోసం ఓ పెద్ద ఒప్పందం జరిగింది. హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) నుంచి వాయుసేన కోసం....

Tejas Fighter Jets: వాయుసేన శక్తికి మరింత తేజస్‌

హెచ్‌ఏఎల్‌ నుంచి 97 దేశీయ యుద్ధ

విమానాల కొనుగోలుకు రక్షణ శాఖ ఒప్పందం

రూ.62 వేల కోట్లతో భారీ డీల్‌

105 కంపెనీల భాగస్వామ్యం.. ఏటా 11 వేల

ఉద్యోగాలు.. 2027-28 నుంచి సరఫరా

న్యూఢిల్లీ, సెప్టెంబరు 25: మన వాయుసేన నుంచి మిగ్‌-21 యుద్ధ విమానాలకు వీడ్కోలు పలుకుతున్న వేళ దేశీయ యుద్ధ విమాన కొనుగోళ్ల కోసం ఓ పెద్ద ఒప్పందం జరిగింది. హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) నుంచి వాయుసేన కోసం 97 తేజస్‌ ఎంకే-1ఏ జెట్లను రూ. 62,370 కోట్లతో కొనుగోలు చేయడానికి రక్షణ మంత్రిత్వ శాఖ ఒప్పందం చేసుకుంది. 97 యుద్ధ విమానాల్లో సింగిల్‌ సీట్‌ ఫైటర్‌ ఎయిర్‌క్రా్‌ఫ్టలు 68, రెండు సీట్ల శిక్షణ విమానాలు 29 ఉన్నాయి. వీటితోఅనుబంధ పరికరాలు కూడా భారత వాయుసేనకు అందించాల్సి ఉంటుంది. 2027-28 నుంచి ఈ తేలికపాటి యుద్ధ విమానాల (ఎల్‌సీఏ) సరఫరా ప్రారంభం కానుంది. తదనంతరం ఆరేళ్లలో సరఫరా పక్రియ పూర్తవుతుంది. గతంలో 2021లో 46,898 కోట్లతో 83 తేజస్‌ ఎంకే-1ఏ ఎయుర్‌క్రా్‌ఫ్టల కొనుగోలుకు ఇలాంటి ఒప్పందమే జరిగింది. తాజా ఒప్పందానికి ఈ ఏడాది ఆగస్టు 19న ప్రధాని ఆధ్వర్యంలో జరిగిన భద్రతా వ్యవహారాలపై క్యాబినెట్‌ కమిటీ అనుమతి ఇచ్చింది. గతంలోని ఒప్పందం కంటే ఈ ఒప్పందంలోని ఎయిర్‌క్రా్‌ఫ్టల్లో 64ు అధికంగా దేశీయ పరికరాలు, 67 అదనపు పరికరాలు ఉంటాయి. అలాగే ఉత్తమ్‌ యాక్టివ్‌ ఎలకా్ట్రనికల్లీ స్కాన్‌ ఆరే (ఏసా) రాడార్‌, స్వయం రక్ష కవచ్‌ సూట్‌తో పాటు క్లిష్టమైన ఉపరితలాల్లో విమానాన్ని నియంత్రణలో ఉంచే యాక్టుయేటర్స్‌ కూడా ఉంటాయి. వాయుసేనలో మిగ్‌-21 వంటి పాత తరం విమానాలను ఉపసంహరిస్తున్నందున వాటి స్థానంలో అధునాతన సింగిల్‌ ఇంజన్‌ తేజస్‌ విమానాలను ప్రవేశపెట్టనున్నారు. భారత వాయుసేన అవసరాలను ఈ దేశీయ విమానాలు తీర్చగలవని భావిస్తున్నారు. చివరి మిగ్‌-21 స్వాడ్రన్‌లకు శుక్రవారం తుది వీడ్కోలు పలుకుతున్న వేళ ఈ ఒప్పందం జరగడం విశేషం. తేజస్‌ విమానాల తయారీ, సరఫరా ప్రాజెక్టులో 105 కంపెనీలు భాగస్వామ్యం కానున్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఒప్పంద కాలంలో ఏటా 11,750 ఉద్యోగాలు వస్తాయని చెప్పింది. దేశీయ ఏరోస్పేస్‌ రంగానికి ఇది పెద్ద ఊతమిస్తుందని పేర్కొంది. అధికారికంగా 42 ఫైటర్‌ స్వాడ్రన్‌లకు అనుమతి ఉండగా, వాటి సంఖ్య 31కి పడిపోయిన నేపథ్యంలో యుద్ధ విమానాల సేకరణపై ఐఏఎఫ్‌ దృష్టి పెట్టింది.


తేజ్‌సకు అమెరికా ఇంజన్లు లేనట్లేనా?

దేశీయ తేజస్‌ మార్క్‌2 విమానాలకు అమెరికా సంస్థ జనరల్‌ ఎలక్ట్రిక్‌(జీఈ) ఎఫ్‌-414 ఇంజన్లను అమర్చకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది. అగ్రరాజ్యం కక్షసాధింపు నేపథ్యంలో ఫ్రాన్స్‌కు చెందిన శాఫ్రాన్‌ ఎస్‌ఏ కలసి భారత్‌లో ఇంజన్‌లు అభివృద్ధి చేసే అవకాశం ఉందని బ్లూమ్‌బెర్గ్‌ తన కథనంలో పేర్కొంది. ఆ కంపెనీ నుంచి భారత్‌ ఇంజన్లు కొనుగోలు చేస్తుందా లేక కలసి తయారు చేస్తుందా అనే విషయంలో స్పష్టత లేదంది. వాస్తవానికి తేజస్‌ మార్క్‌-2 జెట్‌ఇంజన్ల కోసం బైడెన్‌ అధ్యక్షుడిగా ఉన్నపుడు జీఈ ఇంజన్లను భారత్‌లోనే సంయుక్తంగా తయారు చేయడానికి అంగీకారం కుదిరింది. అయితే ఇటీవల ఇరు దేశాల మధ్య అభిప్రాయభేదాలు తీవ్రమైన నేపథ్యంలో ఇంజన్ల ఒప్పందంపై నీలినీడలు కమ్ముకొన్నాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

కృష్ణమ్మకు వరద పోటు.. ప్రభుత్వం అలర్ట్

అసెంబ్లీలో ఆమోదం పొందనున్న పలు బిల్లులు

For More AP News And Telugu News

Updated Date - Sep 26 , 2025 | 06:05 AM