India Rejected Third Party Mediation: ఆపరేషన్ సిందూర్ సమయంలో మూడో దేశం జోక్యాన్ని భారత్ తిరస్కరించింది
ABN , Publish Date - Sep 17 , 2025 | 06:34 AM
తన మధ్యవర్తిత్వం వల్లే భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధం ఆగిందన్న ట్రంప్ ప్రచారాన్ని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి, డిప్యూటీ పీఎం ఇషాక్ ధర్ పరోక్షంగా కొట్టిపారేశారు....
పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ ధర్ ఒప్పుకోలు
న్యూఢిల్లీ, సెప్టెంబరు 16: తన మధ్యవర్తిత్వం వల్లే భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధం ఆగిందన్న ట్రంప్ ప్రచారాన్ని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి, డిప్యూటీ పీఎం ఇషాక్ ధర్ పరోక్షంగా కొట్టిపారేశారు. ‘‘ఆపరేషన్ సిందూర్ సమయంలో మూడో దేశం జోక్యాన్ని భారత్ తిరస్కరించింది’’ అని ఒప్పుకొన్నారు. ఈ విషయాన్ని అమెరికా రక్షణ మంత్రి మార్క్ రుబియో తనకు చెప్పారని వివరించారు. మే నెలలో పహల్గాం దాడి, ఆ తర్వాత ఆపరేషన్ సిందూర్ జరిగిన సంగతి తెలిసిందే. జూలైలో ఇషాక్ ధర్ రుబియోతో సమావేశం అయ్యారు. ‘‘జూలై 25న నేను రుబియోతో సమావేశం అయినప్పుడు.. ఆపరేషన్ సిందూర్ సమయంలో యుద్ధ విరమణపై భారత్‌తో ఏం చర్చించారు అని రుబియోను అడిగాను. దానికి ఆయన.. ఈ వ్యవహారంలో భారత్ మూడో దేశం జోక్యాన్ని కోరుకోలేదు. ఈ అంశాన్ని భారత్ ద్వైపాక్షిక అంశంగా చూసిందని చెప్పారు’’ అంటూ ధర్ వివరించారు. పాకిస్థాన్‌పై యుద్ధం విరమణలో ట్రంప్ ప్రమేయం ఏమీ లేదని భారత్ ఇప్పటికే ఎన్నో సార్లు స్పష్టం చేసింది. ఇషాక్ ధర్ వ్యాఖ్యలతో అది మరింత స్పష్టమైంది.
ఇవి కూాడా చదవండి..
సివిల్ సర్వీస్ అధికారిణి ఇంట్లో భారీగా నోట్ల కట్టలు, నగలు
డెహ్రాడూన్‌ను ముంచెత్తిన వానలు..నీట మునిగిన షాపులు, ఆలయాలు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి