India Health Alert: ప్రసూతి మరణాల్లో రెండో స్థానంలో భారత్
ABN , Publish Date - Apr 13 , 2025 | 03:30 AM
ప్రపంచవ్యాప్తంగా ప్రసూతి మరణాలపై WHO నివేదిక ప్రకారం, భారత్ రెండో స్థానంలో ఉంది. 2023లో రోజుకు సగటున 700 మాతృమరణాలు జరిగాయన్న ఆందోళనకర నివేదిక వెలుగులోకి వచ్చింది

న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: ప్రపంచ వ్యాప్తంగా సంభవిస్తున్న ప్రసూతి మరణాలపై దేశాలన్నీ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. 2000 నుంచి 2023 వరకు ఉన్న ప్రసూతి మరణాల సరళిపై ఓ నివేదిక విడుదల చేసింది. నివారించదగ్గ పరిస్థితుల్లో కూడా 2023లో ప్రపంచ వ్యాప్తంగా రోజుకు సగటున 700 ప్రసూతి మరణాలు సంభవించాయని అందులో వెల్లడించింది. ఆ ఏడాది నైజీరియాలో 75 వేల మాతృమరణాలు నమోదవ్వగా.. ప్రపంచ వ్యాప్తంగా ఆ దేశం ప్రథమ స్థానంలో నిలిచింది. ఇక 19 వేల మరణాలతో భారత్, రిపబ్లిక్ ఆఫ్ కాంగో రెండో స్థానంలో ఉన్నాయి. పాకిస్థాన్‌లో 11 వేల మరణాలు సంభవించాయని నివేదిక పేర్కొంది. ఈ నాలుగు దేశాల్లోని మరణాలే ప్రపంచవ్యాప్త మరణాల్లో సుమారు సగం ఉన్నాయని తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి:
Minister Kollu Ravindra: కులాలు, మతాల మధ్య చిచ్చుపెడితే.. మంత్రి కొల్లు రవీంద్ర మాస్ వార్నింగ్..
South Central Railway: గుడ్ న్యూస్ చెప్పిన దక్షిణ మధ్య రైల్వే.. ఆ ప్రాంతాల్లో ప్రత్యేక రైళ్లు..