Minister Kollu Ravindra: కులాలు, మతాల మధ్య చిచ్చుపెడితే.. మంత్రి కొల్లు రవీంద్ర మాస్ వార్నింగ్..
ABN , Publish Date - Apr 12 , 2025 | 06:42 PM
టీటీడీ ప్రతిష్టను దిగజార్చేందుకు టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పన్నాగాలు పన్నుతున్నారని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. 100 గోవులు మృతిచెందాయంటూ ఎస్వీ గోశాలపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు.

అమరావతి: కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని ఏపీ ఎక్సైజ్, గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. సాక్షి ఛానెల్, పత్రికలో తప్పుడు కథనాలు ప్రసారం చేయిస్తూ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లో క్రైస్తవులు, ముస్లింలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అందుకు పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి, తిరుమలలో గోవుల మృతి అంశాలను వాడుకుంటున్నారని మంత్రి కొల్లు మండిపడ్డారు.
అందులో భాగంగానే టీటీడీ ప్రతిష్టను దిగజార్చేందుకు టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పన్నాగాలు పన్నుతున్నారని మంత్రి కొల్లు ఆరోపించారు. 100 గోవులు మృతిచెందాయంటూ ఎస్వీ గోశాలపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు. అన్యమంత అనుసరిస్తూ నాస్థికుడిగా చెప్పుకునే కరుణాకర్ రెడ్డి.. టీటీడీపై చేయని కుట్రలు లేవని మంత్రి కొల్లు నిప్పులు చెరిగారు. తాళిబొట్ల కుంభకోణం, ప్లాస్మా టీవీల కుంభకోణం, డాలర్ల మాయంతోపాటు అధికారాన్ని అడ్డుపెట్టుకుని భూమన నిధులు సైతం దారి మళ్లించారని ఆరోపించారు.
టీటీడీ ఛైర్మన్‌గా తిరుమలలో బస్ టికెట్లపై అన్యమత ప్రకటనలు రాయించిన ఘన చరిత్ర భూమనదని భగ్గుమన్నారు కొల్లు రవీంద్ర. తిరుమల ఏడు కొండలను ఐదు కొండలుగా మార్చే కుట్రలు సైతం చేసి స్వామివారి ప్రతిష్టను దిగజార్చాలని కుతంత్రాలు పన్నారని ధ్వజమెత్తారు. అదే విధంగా నేడు మరోసారి గోవుల మృతి పేరుతో నాటకం ఆడుతున్నారని ఆగ్రహించారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల రోడ్డు ప్రమాదంలో మరణిస్తే ఓ మతానికి అంటగట్టి రాజకీయ లబ్ధిపొందాలని వైసీపీ చూసిందని మండిపడ్డారు. రాష్ట్రంలో ముస్లింలను సైతం రెచ్చగొట్టాలని చూశారని ధ్వజమెత్తారు.
వక్ఫ్ బిల్లుపై పార్లమెంట్‌లో ద్వంద్వ వైకరి చూపి ముస్లింలను వైసీపీ మోసం చేయాలని చూసిందని మంత్రి కొల్లు దుయ్యబట్టారు. ఉద్దేశపూర్వకంగా మతాల మధ్య చిచ్చుపెట్టి లబ్ధిపొందాలని చూస్తున్న వైసీపీ నేతలపై పోలీసులు నిఘా పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలను రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్న జగన్ మోహన్ రెడ్డి, సాక్షిపై ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాలో(PTI) ఫిర్యాదు చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Viral Video: లేడి ఎస్సైతో అలాంటి పనా.. నీకుందిలే అంటూ నెటిజన్లు ఫైర్..
Tokay Gecko: ఇవేం బల్లులు రా నాయనా.. ఒక్కటి అమ్మేస్తే చాలు హైదరాబాద్‌లో ఇల్లు కొనేయెుచ్చు..
Inter Sudent Passed Away: షాకింగ్ న్యూస్.. పరీక్షల్లో తప్పానని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య..