Share News

Viral Video: లేడి ఎస్సైతో అలాంటి పనా.. నీకుందిలే అంటూ నెటిజన్లు ఫైర్..

ABN , Publish Date - Apr 12 , 2025 | 05:15 PM

తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. ఎక్కడ జరిగిందో ఏమో తెలియదు కానీ వీడియో చూసిన వారంతా అవాక్కవుతున్నారు. వీడియో ప్రకారం.. కొంతమంది పెద్దఎత్తున నిరసన చేస్తున్నారు.

Viral Video: లేడి ఎస్సైతో అలాంటి పనా.. నీకుందిలే అంటూ నెటిజన్లు ఫైర్..
Woman SI viral video

ఇంటర్నెట్ డెస్క్: పోలీసులు విధి నిర్వహణలో భాగంగా అనేక పనులు చేయాల్సి ఉంటుంది. నేరస్థుల పని పట్టడమే కాకుండా నిరసనలు, ధర్నాలు, మరేదైనా ఉద్రిక్త పరిస్థితులు ఉన్న ప్రాంతానికి వెళ్లి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి సందర్భాల్లో పోలీసులు, నిరసనకారులకు మధ్య వాగ్వాదం, తోపులాట సర్వసాధారణం. అయితే ఓ నిరసన కార్యక్రమంలో యువకుడు ప్రవర్తించిన తీరు వైరల్‌గా మారింది. ఏకంగా మహిళా ఎస్సైతోనే తప్పుగా ప్రవర్తించి ఆమె ఆగ్రహానికి గురయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.


తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. ఎక్కడ జరిగిందో ఏమో తెలియదు కానీ వీడియో చూసిన వారంతా అవాక్కవుతున్నారు. వీడియో ప్రకారం.. కొంతమంది పెద్దఎత్తున నిరసన చేస్తున్నారు. వారిని ఆపేందుకు పోలీసులు సైతం భారీగా అక్కడికి చేరుకున్నారు. అయినా నిరసనకారులను అదుపు చేయడం పోలీసులకు కష్టతరంగా మారింది. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.


రంగంలోకి దిగిన మహిళా ఎస్సై నిరసనకారులను చెదరకొట్టే ప్రయత్నం చేశారు. ఒక్కొక్కరిని పట్టుకుని అదుపులోకి తీసుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలోనే ముగ్గురు, నలుగురు పోలీసులు సహా మహిళా ఎస్సై ఓ వ్యక్తిని పట్టుకుని పోలీసు జీపులో ఎక్కించేందుకు తరలిస్తున్నారు. అయితే వారి మధ్యలోకి దూరిన మరో నిరసనకారుడు పెద్ద తప్పే చేశాడు. మహిళా ఎస్సై వెనకకు చేరిన యువకుడు ఆమె నడుము చుట్టూ చేతులు వేసి కౌగిలించుకున్నాడు. ఇది చూసి అక్కడున్న వారంతా నోరెళ్లబెట్టారు.


సెకన్ల వ్యవధిలోనే విషయాన్ని గుర్తించిన ఎస్సై వెంటనే అప్రమత్తమయ్యారు. అప్పటివరకూ తాను పట్టుకున్న వ్యక్తిని వదలేసి ఈ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని చొక్కాపట్టి లాగి మరీ వ్యాన్‌లో ఎక్కించారు. కాగా, ఈ వీడియో రెండు, మూడ్రోజులుగా నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది. అసలు అతనికి ఎంత ధైర్యం అని కొందరూ.. వీడేంట్రా ఇలా ఉన్నాడని మరికొందరు.. మహిళలు ఏ స్థాయిలో ఉన్నా కామాంధులు వారిపై అఘాయిత్యాలకు యత్నిస్తూనే ఉంటారని ఇంకొందరు తెగ కామెంట్లు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Tokay Gecko: ఇవేం బల్లులు రా నాయనా.. ఒక్కటి అమ్మేస్తే చాలు హైదరాబాద్‌లో ఇల్లు కొనేయెుచ్చు..

Inter Sudent Passed Away: షాకింగ్ న్యూస్.. పరీక్షల్లో తప్పానని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య..

Updated Date - Apr 12 , 2025 | 05:45 PM