Share News

EaseMyTrip: భారత్-పాక్ ఉద్రిక్తత.. ఆ ప్రయాణికులకు కీలక సూచనలు..

ABN , Publish Date - May 13 , 2025 | 04:03 PM

భారత్-పాక్ ఉద్రిక్తతల మధ్య మే 8న 27 విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేసినట్లు ఆన్‌లైన్ ట్రావెల్ పోర్టల్ కంపెనీ గురువారం పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే, ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలని.. ప్రత్యామ్నాయ మార్గాలను చూడాలని తాజాగా సలహా ఇస్తూ ట్వీట్ చేసింది.

EaseMyTrip: భారత్-పాక్ ఉద్రిక్తత.. ఆ ప్రయాణికులకు కీలక సూచనలు..
EaseMyTrip

EaseMyTrip: భారతదేశంలో రెండో అతిపెద్ద ఆన్‌లైన్ ట్రావెల్ పోర్టల్ అయిన EaseMyTrip ప్రయాణికులకు కీలక సూచనలు చేసింది. ట్రిప్ ప్లాన్ చేసుకునే ముందు అధికారిక ప్రయాణ సలహాలను పాటించాలని కోరింది. పహల్గామ్ ఉగ్రదాడికి భారతదేశం ఆపరేషన్ సిందూర్ ద్వారా ప్రతీకారం తీర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అటు పాకిస్తాన్ కూడా భారత్‌పై దాడికి ప్రయత్నించి విఫలం అయింది. అయితే, ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో మే 8న 27 విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేసినట్లు ఆన్‌లైన్ ట్రావెల్ పోర్టల్ కంపెనీ పేర్కొంది.


తాజాగా ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలని.. ప్రత్యామ్నాయ ప్రయాణ మార్గాలను చూసుకోవాలని సలహా ఇస్తూ EaseMyTrip కీలక సూచనలు ఇస్తూ ట్వీట్ చేసింది. మీరు ప్రయాణించే విమాన స్థితిని తెలుసుకోవాలని సూచించింది. అలాగే ఏదైన అవసరం ఉంటే EaseMyTrip సమాచారం ఇచ్చేందుకు అందుబాటులో ఉంటుందని తెలిపింది. పూర్తి సమాచారం తెలుసుకుని, సురక్షితంగా ప్రయాణించాలని విజ్ఞప్తి చేసింది. టర్కీ & అజర్‌బైజాన్ పాకిస్తాన్‌కు మద్దతు ఇచ్చినందున, ఆ ప్రాంతాలకు వెళ్లకుండా ఉండటమే మంచిదని, అత్యవసరం ఉంటే తప్ప అక్కడికి ప్రయాణించవద్దని పేర్కొంది.


Also Read:

Stock Market: మళ్లీ నష్టాల్లోకి జారిన స్టాక్ మార్కెట్లు.. 1200 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్

Kavya Maran: కావ్య మారన్‌కు బ్యాడ్ న్యూస్.. ఐపీఎల్‌ను తిరిగి ప్రారంభిస్తున్నారు కానీ

Kohli-Anushka: రిటైర్‌మెంట్ తర్వాత ఆధ్యాత్మిక గురువుతో కోహ్లీ.. ఈయన గురించి తెలుసా..

Updated Date - May 13 , 2025 | 04:48 PM