Share News

Stock Market: మళ్లీ నష్టాల్లోకి జారిన స్టాక్ మార్కెట్లు.. 1200 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్

ABN , Publish Date - May 13 , 2025 | 04:01 PM

సూచీలు సోమవారం భారీ లాభాలను ఆర్జించాయి. అయితే గరిష్టాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో మంగళవారం సూచీలు నష్టాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్ ఏకంగా 1200 పాయింట్లకు పైగా కోల్పోయింది. నిఫ్టీ కూడా అదే బాటలో నడిచింది

Stock Market: మళ్లీ నష్టాల్లోకి జారిన స్టాక్ మార్కెట్లు.. 1200 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
Stock Market

భారత్-పాకిస్తాన్ మద్య ఉద్రిక్తతల నేపథ్యంలో గత వారం స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూసిన స్టాక్‌మార్కెట్లకు కాల్పుల విరమణ ఒప్పందం మంచి జోష్‌ను ఇచ్చింది. సూచీలు సోమవారం భారీ లాభాలను ఆర్జించాయి. అయితే గరిష్టాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో మంగళవారం సూచీలు నష్టాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్ ఏకంగా 1200 పాయింట్లకు పైగా కోల్పోయింది. నిఫ్టీ కూడా అదే బాటలో నడిచింది (Business News).


సోమవారం ముగింపు (82, 429)తో పోల్చుకుంటే మంగళవారం ఉదయం దాదాపు 200 పాయింట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్ రోజంతా నష్టాల్లోనే కొనసాగింది. మధ్యాహ్నం తర్వాత ఆ నష్టాలో మరింత పెరిగాయి. 81, 043 వద్ద ఇంట్రాడే కనిష్టానికి చేరింది. చివరకు 1281 పాయింట్ల నష్టంతో 81,148 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. 346 పాయింట్ల నష్టంతో 24, 578 వద్ద రోజును ముగించింది.


సెన్సెక్స్‌లో బీఎస్‌ఈ లిమిటెడ్, ఐఐఎఫ్‌ఎల్, భారత్ ఎలక్ట్రానిక్, కెనరా బ్యాంక్ షేర్లు లాభాల్లో ముగిశాయి. యూపీఎల్, ఛంబల్ ఫెర్టిలైజర్స్, ఇన్ఫోసిస్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 104 పాయింట్ల రోజును ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 442 పాయింట్లు కోల్పోయింది.

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 13 , 2025 | 04:01 PM